• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మణిరత్నం 'నవరస' సిరీస్...

మణిరత్నం 'నవరస' సిరీస్ నుంచి 9 ఫస్ట్ లుక్స్..!

By - Tupaki Desk
Update: 2021-07-08 09:57 GMT
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నవరసాలను కథాంశంగా తీసుకొని తొమ్మిది విభాగాలతో ''నవరస'' అనే వెబ్ సిరీస్ రూపొంచే పనిని చేపట్టిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఇందులో హాస్యం - శృంగారం - భయానకం - కరుణ - రౌద్రం - కోపం - ధైర్యం - అద్భుతం - బీభత్సం లాంటి నవరసాల ఆధారంగా తొమ్మిది కథలను చెప్పబోతున్నారు. తొమ్మిది మంది దర్శకులు - తొమ్మిది కాన్సెప్టులు - తొమ్మిది భాగాలు - స్టార్ నటీనటులు కలిసి ఈ సిరీస్‌ తో వెబ్ వరల్డ్ లో ఓ కొత్త ఒరవడికి నాంది పలకబోతున్నారు.

మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం నిర్మిస్తున్న 'నవరస' ఆంథాలజీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ జయేంద్ర పంచపకేషన్ భాగస్వామిగా ఉన్నారు. దీని కోసం పాపులర్ నటీనటులు, సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. సూర్య - విజయ్ సేతుపతి - బాబీ సింహా - ప్రకాష్ రాజ్ - బొమ్మరిల్లు సిద్ధార్థ్ - నిత్యా మీనన్ - ఐశ్వర్య రాజేష్ - విక్రాంత్ - గౌతమ్ కార్తీక్ - శ్రీరామ్ - అశోక్ సెల్వన్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. పీసీ శ్రీరామ్ - సంతోష్ శివన్ - మనోజ్ పరమహంస - బాలసుబ్రహ్మనియన్ వంటి సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ - డి. ఇమ్మాన్ - జిబ్రాన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

'నవరస' లోని తొమ్మిది ఎపిసోడ్స్ కు ప్రియదర్శన్ - గౌతమ్ మీనన్ - వసంత్ - కార్తీక్ సుబ్బరాజ్ - అరవింద్ స్వామి - హాలితా సమీన్ - కార్తిక్ నరేన్ - బెయోజ్ నంబియార్ - ఆర్.ఆర్ ప్రసాద్ వంటి 9 మంది దర్శకులు పని చేస్తున్నారు. తమిళ్ లో రూపొందించిన ఈ సిరీస్ ను ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఆంథాలజీ సిరీస్.. ఆగస్ట్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'నవరస' నుంచి తొమ్మిది విభాగాలకు సంబంధించిన 9 ఫస్ట్ లుక్స్ ని విడుదల చేశారు.

* 'గిటార్ కంబి మేలే నిండ్రు' అనే విభాగానికి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య - ప్రయాగా మార్టిన్ ప్రధాన పాత్రలు పోషించారు.

* 'పాయసం' అనే ఎపిసోడ్ కి వసంత దర్శకత్వం వహించారు. ఇందులో డిల్లీ గణేష్ - రోహిణి - అదితి బాలన్ - కార్తీక్ కృష్ణ కీలక పాత్రల్లో నటించారు

* 'సమ్మర్ ఆఫ్ 92' అనే విభాగానికి స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ డైరెక్షన్ చేశారు. ఈ సిరీస్ లో కమెడియన్ యోగిబాబు - రమ్య నంబీసన్ ముఖ్య పాత్రలు పోషించారు.

* డైరెక్టర్ బెజోయ్ నంబియార్ 'ఎథిరి' అనే ఎపిసోడ్ ని రూపొందించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి -ప్రకాష్ రాజ్ - రేవతి మరియు అశోక్ సెల్వన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.

* 'శాంతి' విభాగానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో బాబీసింహా - గౌతమ్ వాసుదేవ్ మీనన్ - మాస్టర్ తరుణ్ కీ రోల్స్ ప్లే చేశారు.

* అరవింద్ స్వామి 'రౌద్రమ్' రసానికి దర్శకత్వం వహించారు. శ్రీరామ్ - రిత్విక - అభినయశ్రీ - రమేష్ తిలక్ - గీతా కైలాసం ఇందులో నటించారు.

* 'ప్రాజెక్ట్ అగ్ని' అనే ఎపిసోడ్ కు కార్తీక్ నరేన్ డైరెక్షన్ చేశారు. అరవింద్ స్వామి మరియు ప్రసన్న ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు చేశారు.

* ఆర్.రవీంద్ర ప్రసాద్ 'ఇన్మై' అనే విభాగాన్ని తెరకెక్కించారు. బొమ్మరిల్లు సిద్దార్థ్ - పార్వతి తిరువోర్తు ఇందులో పాత్రధారులు.

* 'తునింత పిన్' సిరీస్ ను హాలితా సమీన్ రూపొందించారు. అధర్వ మురళి - అంజలి మరియు కిషోర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
Tags:    
  • navarasa 
  • maniratnam 
  • Jayendra 
  • gauthamvasudevmenon 
  • vasanth 
  • priyadarshan 
  • vijaysethupathi 
  • prakashraj 
  • peace 
  • karthiksubbaraj 
  • bobbysimha 
  • roudhra 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS