పుష్ప: 8 రోజుల్లో 35 లక్షల టిక్కెట్లు సేల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నాడు. అతని తాజా చిత్రం `పుష్ప: ది రైజ్` టిక్కెట్ల పరంగా కొత్త రికార్డును సృష్టించింది. బుక్ మై షోలో కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా 35 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. 2021లో విడుదలైన ఏ తెలుగు సినిమాకైనా ఇది టాప్ రికార్డ్.
దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అన్ని చోట్లా బాక్సాఫీస్ విండో వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఆరంభం క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా బన్ని వన్ మ్యాన్ షో ముందు అవేవీ నిలబడలేదు. ఇక పుష్ప 2 కోసం సుకుమార్ ఇప్పటికే సన్నాహకాల్లో ఉన్నారు.
విమర్శలకు సుక్కూ సమాధానమిదే..
పుష్ప -ది రైజ్ కంటెంట్ పరంగా వైవిధ్యమైనది. అడవి నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పక్కాగా మాస్ ఆడియెన్ ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాపై క్రిటిక్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సెకండాఫ్ లో ల్యాగ్ సన్నివేశాలపైనా విస్త్రతంగా చర్చ సాగింది. అయితే తప్పంతా ఎక్కడ జరిగింది? అంటూ సుకుమార్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలో ఎంతో ఆశించిన ఫహద్ ఫాజిల్ - అనసూయ పాత్రలు ఆడియెన్ ని పూర్తిగా సంతృప్తి పరచలేదు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యకరం.
నిజానికి మొదటి భాగం రెండో భాగానికి లీడ్ మాత్రమే! ఇందులో పాత్రల్ని పరిచయం చేసామంతే. రెండో భాగంలో ఆ పాత్రలన్నీ ఎలివేట్ అవుతాయి. అసలు మజా రెండో పార్ట్ లోనే ఉంటుంది. మొదటి పార్ట్ లో కొన్ని సన్నివేశాలు డ్రాగ్ అవ్వడానికి కారణం ఉందని సుకుమార్ అన్నారు. పుష్ప - ది రైజ్ ద్వితీయార్థంలో ఎక్కువగా పాత్రకు లీడ్ తీసుకోవడం వల్లనే ల్యాగ్ కనిపించిందని సుకుమార్ అన్నారు. ``పుష్ప అసలు కథ పార్ట్-2లోనే ఉంది. పార్ట్-1 అసలు ఇతివృత్తానికి ఒక లీడ్ మాత్రమే. పార్ట్ 2 మరో లెవల్లో ఉంటుంది. మీరు సమర్థించని అన్ని పాత్రలు పార్ట్ లో మరో రేంజులో ఉంటాయి. సెకండ్ పార్ట్ లో మరో మూడు పాత్రల్ని అదనంగా చేరుస్తున్నాం`` అని తెలిపారు. పార్ట్ 2లో ఫహద్ ఫాజిల్ పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ చూస్తారని తెలిపారు. అనసూయ పాత్రతో పాటు ఇతరులకు సెకండ్ పార్ట్ లోనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సుకుమార్ అన్నారు. ఫిబ్రవరిలో పార్ట్ 2 సెట్స్‌పైకి వెళుతుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సాగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది డిసెంబర్ లేదా ఇంకా ముందే విడుదల చేస్తామని సుక్కూ తెలిపారు.