25 ఏళ్లు పూర్తి సందర్బంగా 18 దేశాల్లో రీ రిలీజ్‌

Update: 2020-10-23 12:30 GMT
బాలీవుడ్‌ లో ఇప్పటికి ఎప్పటికి నిలిచి పోయే సినిమా దిల్‌ వాలే దుల్హానియా లేజాయేంగే. షారుఖ్‌ ఖాన్‌ మరియు కాజోల్‌ లు నటించిన ఈ సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించాడు. 1995 అక్టోబర్‌ 20న విడుదలైన ఈ సినిమా మొన్నటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా మేకర్స్‌ సినిమాను రీ రిలీజ్‌ చేసేందుకు గాను సిద్దం అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 దేశాల్లో ఈ సినిమా రీ రిలీజ్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని దేశాల్లో దాదాపుగా ఒకే సమయంలో సినిమాను విడుదల చేయబోతున్నారు.

షారుఖ్‌ ఖాన్‌ మరియు కాజోల్‌ లను బాలీవుడ్‌ నెం.1 స్టార్స్‌ ను చేసిన ఈ సినిమాను అప్పట్లో కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించారు. అప్పట్లో ఆ బడ్జెట్‌ చాలా ఎక్కువ అనే ప్రచారం జరిగింది. అయితే సినిమా ఏకంగా రూ.110 కోట్లను వసూళ్లు చేసింది. పాతిక కోట్లు చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటున్న సమయంలో రూ.110 కోట్లను వసూళ్లు చేసి ఆల్‌ టైం రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను జెర్మనీ.. యూఏఈ.. సౌదీ.. ఖత్తర్‌.. యూఎస్‌ఏ.. యూకే.. సౌత్‌ ఆఫ్రియా.. ఆస్ట్రేలియా.. న్యూజీలాండ్‌.. ఫీజీ.. నార్వే.. స్వీడన్‌.. స్పెయిన్‌.. స్విడ్జర్లాండ్‌.. ఈస్టోనియా మరియు ఫిన్లాండ్‌ ఇంకా పలు దేశాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో విడుదల కాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం.
Tags:    

Similar News