• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో టాక్: ఎయిటీ నైంటీ...

వీడియో టాక్: ఎయిటీ నైంటీ హౌ స్వీటీ

By - Tupaki Desk
Update: 2018-10-30 06:34 GMT
ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చాక ఉదయం లేచినప్పటి నుంచి టూత్ బ్రష్ మొదలుకుని రాత్రి పడుకోబోయే ముందు భోజనం చేసే దాకా అన్నింటికీ ఆన్ లైన్ అంటున్నాం కానీ ఇవేవి లేని ఒకప్పటి ప్రపంచం ఎలా ఉండేదా అనే అనుమానం ఇప్పటి తరానికి రావడం సహజమే. సాంకేతిక విప్లవం 1996 నుంచి మెల్లగా ఊపందుకుంది. అంతకు ముందు కనీసం శాటిలైట్ ఛానల్ కూడా లేని వాతావరణంలో జనాలు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆ టైం లో ఉన్న పిల్లలు కాని పెద్దలు కాని ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఆ రోజులే వేరు అని ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటాడు.

సరిగ్గా ఈ ఐడియానే దర్శకుడు చందు మొండేటిని ప్రేరేపించింది. నవంబర్ 2న విడుదల కానున్న సవ్యసాచిలో ఇలాంటి 80 దశకం నాటి అనుభూతులను స్పృశిస్తూ విడుదల చేసిన వీడియో ట్రైలర్ లో 81 - 82 మొదలుకుని 90 లలో అంటూ ఆ కాలక్రమంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు వాడుకలో ఉన్న వస్తువులు అన్ని చూపించడం బాగా పేలింది. ఎక్కడా రెగ్యులర్ అంశాలకు చోటివ్వకుండా పాటలో మెయిన్ థీమ్ కు కట్టుబడి చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంది. నాగ చైతన్య నిధి అగర్వాల్ ల జంట క్యూట్ గా ఉండగా కీరవాణి పాట భలే హుషారుగా ఉంది.

ఖైది విడుదల-ఎన్టీఆర్ టిడిపి పార్టీ స్థాపన-ఇండియా ఫస్ట్ వరల్డ్ కప్- గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్-పాపిన్స్ ఇలా ఒకటా రెండా చాలా మెమొరీస్ వింటేజ్ తరహాలో షూట్ చేయడం బాగా ఆకట్టుకుంది. మొత్తానికి కథలో కాన్సెప్ట్ తో పాటు పాటల్లో కూడా చాలా వైవిధ్యత చూపిస్తున్న చందు మొండేటి కీరవాణిలు ధియేటర్లో నుంచి కాసేపు టైం మెషీన్ లో ముప్పై ఏళ్ళ వెనక్కు తీసుకెళ్ళబోతున్నారు. నాగ చైతన్య హీరోగా మాధవన్ విలన్ గా నటించిన ఈ మూవీలో హీరొయిన్ నిధి అగర్వాల్. భూమిక మరో కీలక పాత్రలో కనిపించనుంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    
  • 1980 
  • 81 
  • 82 Song Trailer 
  • Naga Chaitanya 
  • Savyasachi Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS