చరణ్ డాడీ.. 16 గంటలు అంటున్నాడు

Update: 2017-02-12 08:41 GMT
కృష్ణవంశీ దర్శకత్వంతో రూపొందిన గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్ కి డాడీ పాత్రలో నటించిన యాక్టర్ రెహమాన్. తెలుగు.. తమిళ్.. మలయాళ భాషల్లో తెగ బిజిగా ఉండే ఈ యాక్టర్.. రీసెంట్ గా లీడ్ రోల్ లో చేసిన మూవీ ద్రువంగల్ పత్తినారు. తమిళ్ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకొస్తున్నారు బిచ్చగాడు నిర్మాతలు చదలవాడ బ్రదర్స్.

తెలుగులో '16' పేరుతో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ఆసక్తి కలిగించేలా ఉంది. ఆ 16 గంటలు నా జీవితాన్ని మార్చేశాయ్ అంటూ చెప్పిన విధానం బాగుంది. 16 చిత్రానికి ఫిబ్రవరి 16న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు నిర్మాతలు. ఈ సినిమాలో మొత్తం 16 పాత్రలు ఉంటాయి. అన్నీ వేటికవే అన్నట్లుగా ఉన్నా.. అన్నీ ఇంటర్ లింక్డ్ గా ఉండే ద్రువంగల్ పత్తినారులో స్క్రీన్ ప్లే ఆసక్తి కలిగించేలా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో సస్సెన్స్ కూడా మిళితమై ఉండడం విశేషం.

గతేడాది చివర్లో తమిళనాట చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. తర్వాత భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీకి ఇండస్ట్రీ నుంచి చాలానే ప్రశంసలు అందాయి. మంచి చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్న చదలవాడ బ్రదర్స్.. ఈ ధ్రువంగల్ పత్తినారు తెలుగు వెర్షన్ 16 కూడా తెలుగు ప్రేక్షకులను  మెప్పిస్తుందని నమ్మకంతో ఉన్నారు.

Full View
Tags:    

Similar News