ఆ 15నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ RRR ఆత్మ‌

Update: 2021-12-20 02:30 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుక‌గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టించింది. ట్రైల‌ర్ ఆద్యంతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌ల‌తో పాటు బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌న్ పాత్ర‌ను కూడా ప‌రిచ‌యం చేసిన తీరు ఆక‌ట్టుకుంది.

నిప్పు (అల్లూరి సీతారామ‌రాజు).. నీరు (కొమ‌రం భీమ్) పాత్ర‌ల‌కు ధీటైన పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌న్ పాత్ర ఉంటుంద‌ని తెలిసింది. అజయ్ దేవగన్ తో ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకోనుంది. RRR ఆత్మ ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉందని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. ఆలియా భ‌ట్ ఈ చిత్రంలో సీత పాత్ర‌లో న‌టిస్తుండ‌గా బ్రిటీష్ నటి ఒలీవియా మోరిస్ భీమ్ ని ఇష్ట‌ప‌డే అమ్మాయిగా క‌నిపించ‌నుంది.

కీరవాణి నేప‌థ్య సంగీతం ఈ సినిమాకి ప్రధాన అస్సెట్ కానుంది. సినిమా ప్రారంభంతో ఆర్.ఆర్ ని మొదలు పెట్టకుండా సినిమా మొత్తం చూసి తన రీ-రికార్డింగ్ ని ప్రారంభించడానికి ఆత్మను తాకే పాయింట్ ని ఎంచుకున్నార‌ని రాజ‌మౌళి తెలిపారు. సినిమా మొత్తం చూశాక‌ అజయ్  సార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హృదయం (ఆత్మ) అని చెప్పాడు. సినిమాకి అక్కడ నుండి కథ మొదలవుతుంది.నేను నా రీ-రికార్డింగ్ అక్కడి నుండి ప్రారంభించబోతున్నాను అని తెలిపార‌న్నారు. మొదట 15 నిమిషాల సీక్వెన్స్ కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు. తరువాత మిగిలిన చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు. కానీ ఆ 10-15 నిమిషాల ఎపిసోడ్ లో సోల్ పాయింట్ ఉంటుంది. సంగీతం అందించేప్పుడు తాను ఇక్కడ ఏదో మిస్ అయినందున మళ్లీ ప‌ని చేయాల‌ని దాదాపు రెండు నెలల పాటు కష్టపడి ఒక రోజు అతను ఈ పాటను ఇక్కడ ప్లే చేస్తాము అని అకస్మాత్తుగా ఒక పాటతో వచ్చారు. ఆ పాట‌కు త‌నే స్వయంగా సాహిత్యం రాశారు...అదే `జనని` పాట. అందుకే దీనిని `సోల్ ఆఫ్ ఆర్‌.ఆర్‌.ఆర్` అని పిలుస్తాం అని రాజ‌మౌళి తెలిపారు.

స్వాతంత్య్ర సమ‌రంలో వీర ర‌సాన్ని పండించిన ఇద్ద‌రు ఫిక్ష‌న‌ల్ వీరుల క‌థాంశంతో ఆర్.ఆర్.ఆర్ తెర‌కెక్కింది. అల్లూరి.. కొమ‌రం భీమ్ పాత్ర‌ల స్ఫూర్తితో ఈ ఫిక్ష‌న‌ల్ పాత్ర‌ల్ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ డిజైన్ చేసారు. రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఇది విజువ‌ల్ ఫీస్ట్ గా ఉంటుంద‌ని ఇప్ప‌టికే ట్రైల‌ర్ ప్రూవ్ చేసింది. సౌత్ - నార్త్ లో ఈ చిత్రం అత్యంత భారీగా రిలీజ‌వుతోంది.
Tags:    

Similar News