• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆసక్తిరేపుతోన్న '10th...

ఆసక్తిరేపుతోన్న '10th క్లాస్ డైరీస్' ట్రైలర్..!

By - Tupaki Desk
Update: 2022-06-20 05:33 GMT
'గరుడవేగ' చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన అంజి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''10th క్లాస్ డైరీస్''. ఇందులో అవికా గోర్ - శ్రీకాంత్ (శ్రీరామ్) - శ్రీనివాస రెడ్డి - అర్చన - శివ బాలాజీ - వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం ట్రైలర్ ను ఆవిష్కరించారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ''టెన్త్ క్లాస్ డైరీస్'' థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు. సుమారు రెండున్నర నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇది లవ్ ఎమోషన్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కూడిన ఎంటర్టైనర్ అని సూచిస్తోంది.

స్కూల్ డేస్ లోనే ప్రేమలో పడిన శ్రీరామ్ - అవికా.. ఇంట్లో పెద్దల గొడవలతో విడిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన శ్రీరామ్.. కెరీర్ సంపాదన మీద ఫోకస్ పెట్టాడు. మరోవైపు అవికా స్వదేశంలో తనకు నచ్చిన ట్రావెలింగ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

అయితే కొన్నేళ్ల తర్వాత శ్రీరామ్ తన్న చిన్ననాటి ప్రేయసి అవికాను వెతుక్కుంటూ ఇండియాకి తిరిగి వస్తాడు. స్నేహితుల సహాయంతో ఆమెను కలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవికా ఏదో సమస్యలో చిక్కుకొని అదృశ్యమైనట్లు తెలుస్తోంది.

అసలు అవికాకు ఏమైంది? ఆమె ఎక్కడుంది? శ్రీరామ్ ఆమెను కలిశాడా? చివరకు అతని ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమా కథాంశామనిఅర్థం అవుతోంది. ట్రైలర్ లోనే కథ ఏంటో చెప్పినప్పటికీ.. ఏమి జరిగిందో అనే ఆసక్తి కలిగించారు.

ఇందులో నాజర్ - హిమజ కీలక పాత్రల్లో కనిపించారు. వెన్నెల రామారావు ఈ చిత్రానికి కథను అందించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చగా.. ఎస్ చిన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. డైరెక్టర్ బీఅంజి సినిమాటోగ్రఫీని నిర్వహించారు.

SR మూవీ మేకర్స్ - Aak - అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ పతాకాలపై అచ్యుత్ రామారావు పి మరియు రవితేజ మన్యం ఈ చిత్రాన్ని నిర్మించారు. ''టెన్త్ క్లాస్ డైరీస్'' చిత్రాన్ని జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


Full View

Tags:    
  • DirectorAnji 
  • 10thClassDiariesTrailer 
  • AvikaGaur 
  • Srikanth 
  • ShivaBalaji 
  • Archana 
  • HeroDanush 
  • TenthClassDiariesTrailer 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS