మెగా హీరో వరుణ్ తేజ్.. పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గద్దలకొండ గణేష్ సినిమాలోని ఎల్లువచ్చి గోదారమ్మ పాట ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శోభన్ బాబు మరియు శ్రీదేవిల ఎవర్ గ్రీన్ సాంగ్ ఎల్లువచ్చి గోదారమ్మ పాట ను ఈ సినిమాలో రీమిక్స్ చేయడం జరిగింది. పాటను స్వల్పంగా మార్చి రీమిక్స్ చేశారు. ఒరిజినల్ వర్షన్ కు కే చక్రవర్తి సంగీతాన్ని అందించగా రీమిక్స్ కు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. సినిమా విడుదల అయిన కొన్ని రోజులకు ఎల్లువచ్చి గోదారమ్మ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
2019 నవంబర్ 1 వ తారీకున యూట్యూబ్ లో వచ్చిన ఈ పాట అప్పటి నుండి ఇప్పటి వరకు జోరు కంటిన్యూ చేస్తూనే ఉంది. ఏడాదిన్నర కాలంలో ఈ పాట 100 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. వంద మిలియన్ వ్యూస్ దక్కించుకున్న కొన్ని పాటల జాబితాలో ఈ పాట కూడా చేరింది. ఎల్లువచ్చి గోదారమ్మ పాట వంద మిలియన్ ల జాబితాలో చేరడంతో చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలో పాట కూడా దర్శకుడు హరీష్ శంకర్ చాలా అందంగా చిత్రీకరించాడు. వింటేజ్ లుక్ తో శోభన్ బాబు మరియు శ్రీదేవిలు అప్పట్లో ఎలా కనిపించారో అలాగే కనిపించేలా ప్లాన్ చేశారు. సెట్ ప్రాపర్టీస్ తో సహా అన్ని కూడా కలవడంతో అద్బుతంగా కన్నుల వింధుగా పాట ఉండి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలో ఆకట్టుకోవడంతో పాటు వీడియో సాంగ్ ను కూడా ప్రేక్షకులు తెగ చూసేశారు.