• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుక్కు త‌మిళ్ సినిమా...

సుక్కు త‌మిళ్ సినిమా పోస్ట‌రొచ్చింది

By - Tupaki Desk
Update: 2017-07-15 10:06 GMT
ప్రేమ‌క‌థ‌ల్ని తీయ‌డంలో సుకుమార్ స్టైలే వేరు. ఆర్య త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో మాట్లాడుకొనేలా `100%ల‌వ్‌` తెర‌కెక్కించి విజ‌యాన్ని సొంతం చేసుకొన్నాడు సుక్కు. గీతా ఆర్ట్స్ నిర్మించిన చిత్ర‌మైనా రైట్స్ మాత్రం తానే సొంతం చేసుకొన్నాడు.  తెలుగులో ఘ‌న‌విజ‌యం సాధించిన ఆ సినిమాని హిందీలో సొంతంగా తీయాల‌ని అప్ప‌ట్లోనే ప్ర‌య‌త్నాలు చేశారాయ‌న‌. మ‌రి ఏమైందోకానీ... ఆ ప్ర‌య‌త్నాన్ని మానుకొన్నాడు. ఆ త‌ర్వాత త‌న సినిమాల‌తో బిజీ అయిపోయాడు సుకుమార్‌. చాలా రోజుల త‌ర్వాత ఇప్పుడు త‌మిళంలో రీమేక్ చేయిస్తున్నాడు. త‌న శిష్యుడైన చంద్ర‌మౌళి అనే ద‌ర్శ‌కుడికే త‌మిళ రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాడు. జి.వి.ప్ర‌కాష్‌కుమార్‌ - లావ‌ణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

తెలుగులో నాగ‌చైత‌న్య‌ - త‌మ‌న్నా క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. త‌మిళంలో జీవి - లావ‌ణ్య అయితేనే బాగుంటార‌ని వాళ్ల‌ని ఎంపిక చేసుకొన్నారు. అక్క‌డ `100% కాద‌ల్‌` పేరుతో తెర‌కెక్కుతున్న ఆ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ తాజాగా బ‌య‌టికొచ్చింది. హీరోహీరోయిన్ల కాలి వేళ్ల‌తో కూడిన ఆ పోస్ట‌ర్ చాలా బాగుంది. సినిమా చూసేశాం కాబ‌ట్టి మ‌న‌కు ఆ పోస్ట‌ర్ చూసేసిన‌ట్టుగానే ఉంది. కానీ త‌మిళ్ ప్రేక్ష‌కులు మాత్రం ఫ్రెష్‌ గా ఫీల‌వుతారు. త‌మిళంలో ఈ సినిమా మంచి రిజ‌ల్ట్‌ ని తీసుకొస్తే మాత్రం హిందీలోనూ రీమేక్ చేయ‌డం ఖాయమంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు.
Tags:    
  • GV Prakash 
  • 100% Kadhal Movie 
  • Telugu news 

Similar News

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS