ఆరు నెల‌లుగా థియేట‌ర్లు తెర‌వ‌క 10 వేల కోట్ల న‌ష్టం?

Update: 2020-09-15 13:30 GMT
ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారీ విజృంభ‌ణ అంత‌కంత‌కు పెరుగుతుంటే సినిమా థియేట‌ర్లు తెర‌వాలా వ‌ద్దా? అన్న‌దానిపై స‌రికొత్త డిబేట్ సాగుతోంది. ఇండ‌స్ట్రీలో ప‌లువురు సినీపెద్ద‌లు స్వ‌యంగా థియేట‌ర్లు తెరిచినా న‌ష్టాలు మూట‌గ‌ట్టుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే ఇలానే ప‌రిస్థితి కొన‌ సాగితే ఎగ్జిబిట‌ర్లు స‌ర్వ‌నాశ‌నం అయిపోవ‌డం ఖాయ‌మ‌ని.. ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న వారి బ‌తుకులు ఉపాధి లేక తిండి కి లేక‌ తెల్లారి పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌స్తుత ఉత్పాతం లో ప్ర‌తి చ‌ర్య వెన‌క బొమ్మ బొరుసు అన్న ప్రాతి ప‌దిక‌న ప్ర‌భుత్వాలు ఆలోచించాల్సి వ‌స్తోంది. ఇక ఇటీవ‌లి కాలంలో కేంద్రాన్ని ఒప్పించి తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరిచే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు యోచి స్తున్నాయ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ లో సినిమా థియేట‌ర్ల‌‌ను తిరిగి తెరిపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ మేర‌కు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేస్తోందిట‌‌. కేంద్ర హోం శాఖ‌ కార్యదర్శి తో ఇటీ వల జరిగిన సమావేశం తరువాత అసోసియేషన్ మ‌రో సారి బహిరంగ లేఖ ను విడుదల చేయ‌డం ఆస‌క్తి ని రేకెత్తిస్తోంది.

ఓ అంచ‌నా ప్ర‌కారం.. నెల‌కు 1500 కోట్ల చొప్పున ఆరు నెల‌ల‌కు థియేట‌ర్లు తెర‌వ‌నందుకు 10 వేల కోట్ల మేర న‌ష్టం వాటిల్లింద‌ని అంచ‌నా వేస్తున్నారు. దాదాపు  రెండున్న‌ర‌ లక్షల మంది ప్రత్యక్ష ఉపాధి ని.. లక్షల మంది పరోక్ష ఉపాధిని కోల్పోయారు. అందుకే థియేట‌ర్ రంగాన్ని ఎలా అయినా బ‌తికించే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. సుర‌క్షిత విధానాలతో సినిమా వీక్ష‌ణ కోసం తీవ్ర‌మైన క‌స‌ర‌త్తు సాగుతోంది. ఇక ఎగ్జిబిష‌న్ రంగంలో స‌మస్య‌ల్ని విన్న త‌ర్వాత అయినా కేంద్రం స్పందించే పరిస్థితి లేదు. ఇక ఇటీవ‌ల 70 దేశాల్లో రిలీజైన `టెనెట్` క‌నీసం బ్రేక్ ఈవెన్ అయినా సాధించ‌లేక‌పోయింది. క్రిస్టోఫ‌ర్ నోలాన్ లాంటి ట్యాలెంటెడ్ ఆస్కార్ రేంజు ప‌ర్స‌నాలిటీ నిర్మించిన ఈ సినిమాకే ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తితే ఇప్పుడు థియేట‌ర్లు తెరిపిస్తే సినిమాలు చూసేదెవ‌రు? అన్న విమ‌ర్శ‌లు ఒక సెక్ష‌న్ లో ఉన్నాయి.
Tags:    

Similar News