మళ్లీ నేర్చుకుంటున్నా.. ముందుకు వెళ్తున్నా! స్టార్ హీరోయిన్ స్టేట్‌మెంట్స్
దాదాపు రెండు దశాబ్దాల పాటుగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న తమన్నా భాటియా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీశాయి;
దాదాపు రెండు దశాబ్దాల పాటుగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న తమన్నా భాటియా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీశాయి. తన కెరీర్ ను ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తున్నట్లుగా అనిపిస్తోందని ఆమె చెప్పడం, ఆమె కెరీర్‌లో కొత్త దశకు సంకేతంగా కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్‌గా స్థిరపడిన తర్వాత కూడా ఇలా రీ- ఇన్వెన్షన్ గురించి ఇంత క్లారిటీగా మాట్లాడటం అరుదైన విషయం.
ఇదే సమయంలో, మహిళా నటీమణులకు అవకాశాలు పరిమితంగా ఉంటాయని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఉన్న జెండర్ అసమానతలపై మరోసారి దృష్టిని సారించాయి. ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించడం హీరోయిన్లకు ఎంత కష్టమో తమన్నా మాటల్లో స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు లభిస్తున్న కొత్త అవకాశాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. దేశవ్యాప్తంగా అభిమానులు చూపుతున్న ఆదరణ తనను ఎంతో వినమ్రంగా ఉంచుతోందని, అదే తనను మరింత కష్టపడేలా ప్రేరేపిస్తోందని ఆమె తెలిపారు. కాగా రీసెంట్ టైమ్స్ లో తమన్నాకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ బాగా పెరుగుతుంది. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకూ విస్తరించిన ఆమె ఫాలోయింగ్, ఇప్పుడు దేశవ్యాప్తంగా బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తర్వాతి సినిమా వివాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించడం మరో ముఖ్య ఆకర్షణగా మారింది. ఈ ఫ్రెష్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. డైరెక్టర్ దీపక్ మిశ్రా, నిర్మాత అరుణబ్ కుమార్ కలిసి రూపొందిస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా కూడా భిన్నంగా ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తమన్నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అంతా భావిస్తున్నారు.
ఇక కెరీర్ ట్రాన్సిషన్ పరంగా చూస్తే, తమన్నా గ్లామర్ పాత్రల నుంచి కంటెంట్ ఆధారిత పాత్రల వైపు క్రమంగా మారుతోంది. ఈ మార్పు ఆమెను మరింత స్ట్రాంగ్ నటిగా నిలబెట్టే అవకాశముంది. సీనియర్ హీరోయిన్లు మళ్లీ శక్తివంతమైన పాత్రలతో రీఎంట్రీ ఇస్తున్న ట్రెండ్‌లో తమన్నా కూడా తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. మొత్తంగా చూస్తే, తమన్నా వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత అనుభవాలకే పరిమితం కావు. అవి ఒక నటిగా నిరంతరం ఎదగాలనే తపనను, కొత్త అవకాశాలను ఆహ్వానించే ధైర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.