నీ మొండితనం వల్లే ఇది జరిగింది : పూరీ
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విడుదలై నేటికి ఏడాది గడిచింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ కి మరియు హీరో రామ్ కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి తెచ్చిన సినిమా అని చెప్పవచ్చు. ఇక హీరోయిన్లు నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ పూరి, హీరో రామ్, ప్రొడ్యూసర్ ఛార్మీ ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇస్మార్ వన్ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతోంది.
ఈ సందర్భంగా పూరి ట్విట్టర్ లో స్పందిస్తూ ''ఇస్మార్ట్ శంకర్ విజయంతో నా జీవితంలోకి తిరిగి ఎనర్జీ వచ్చింది. నన్ను చాలా విశ్వసించినందుకు రామ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నీతో ప్రతిరోజూ ఓ సెలబ్రేషన్ లాంటిది.. నిన్ను కలిసి గట్టిగా కౌగిలించుకొని మరోసారి థాంక్స్ చెప్పడానికి వెయిట్ చేయలేకపోతున్నాను. నువ్వు తురుం రా'' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు రామ్ రిప్లై ఇస్తూ ''నా గన్ మిమ్మల్ని కలిసిన రోజు. మీరు ఇస్మార్ట్ శంకర్ ను నా ముందు ఉంచటం నాకు మరుపురాని రోజు. మరెవరూ చేయలేని విధంగా నన్ను చూపినందుకు ధన్యవాదాలు. లవ్ యూ. మిమ్మలి చూడటానికి వెయిట్ చేయలేకపోతున్నా'' అని పేర్కొన్నారు.
అంతేకాకుండా ''మామా.. ఏక్ సాల్ హో గయా.. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఆలోచించకు.. అభిప్రాయాల గురించి అసలే ఆలోచించకు... నీకు నచ్చినట్టుగా నిన్ను సంతోషంగా ఉంచే వాటి గురించి మాత్రమే ఆలోచించు.. ఇస్మార్ట్ శంకర్ నాకెప్పుడూ ప్రత్యేకమే'' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు రామ్. ''ప్రతీ రోజూ ఎంతో కష్టపడి పని చేసిన మా లిటిల్ బాస్ ప్రొడ్యూసర్ ఛార్మీకి థ్యాంక్స్.. హాట్ హాటర్ హాటెస్ట్ నిధి అగర్వాల్.. మై క్రేజీ చాందినీ.. మీరే ఫైర్.. సత్యదేవ్ చాలా ప్రతిభావంతుడైన నటుడు.. మణిశర్మ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు'' అని ప్రశంసించారు.
ఇక పూరీ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఛార్మీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ''ఒక సంవత్సరం క్రితం ఇదే రోజు ఓ పెద్ద పండగ.. ఎంతో కష్టపడే నా నిర్మాత ఛార్మీకి ధన్యవాదాలు. నీ మొండితనం వల్లే ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయింది. నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్.. చిత్ర యూనిట్ మొత్తానికి థ్యాంక్స్'' అని ఎమోషనల్ ట్వీట్ చేసారు పూరీ.