జోకర్ వివాదం తర్వాత నటుడిలో సెల్ఫ్ సెన్సార్‌షిప్!
`కల్కి 2898 ఏడీ` చిత్రంలోని ప్రభాస్ పాత్ర చిత్రణపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన జోకర్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఎంత దుమారం రేపాయో తెలిసిందే.
`కల్కి 2898 ఏడీ` చిత్రంలోని ప్రభాస్ పాత్ర చిత్రణపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన జోకర్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఒక స్టార్ హీరోను ఉద్దేశించి అర్షద్ చేసిన వ్యాఖ్యలు కారణంగా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకతను.. ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయంలో ప్రభాస్ కు మద్దతుగా స్టార్ హీరోలు సైతం నిలబడడ్డారు. తాజాగా ఈ వివాదం తర్వాత అర్షద్ వార్సీలో రియలైజేషన్ మొదలైంది. ఇదే అంశాన్ని అర్షద్ ప్రస్తావిస్తూ అప్పటి నుంచి తన ఆలోచనల్లో, ప్రవర్తనలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పట్ల, అభిమానుల ఎమోషన్స్ పట్ల తాను మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయిం చుకున్నట్లు అర్షద్ వార్సీ పేర్కొన్నారు. ఎవరినైనా ఉద్దేశించి ఏదైనా అన్నప్పుడు అది ఏ స్థాయిలో అర్థం చేసుకోబడుతుందో? తనకిప్పుడు బాగా అర్థమైందన్నారు. దీంతో ఆయన ఇప్పుడు సెల్ఫ్ సెన్సార్‌షిప్విధానాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపై తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తానన్నారు.
ఇకపై కేవలం తన సన్నిహితులతో మాత్రమే జోకులు వేస్తానని.. తెలియని వ్యక్తుల ముందు లేదా బహిరంగ వేదికలపై మాటలను చాలా జాగ్రత్తగా మలుచుకుంటానని తెలిపారు. `ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఇంటర్నెట్ యుగంలో ఆ అభిప్రాయాన్ని ఎలా చెపుతున్నామనేది ముఖ్యం` అని అర్షద్ అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన తనకు సోషల్ మీడియా సంస్కృతి గురించి ఒక పాఠం నేర్పినట్లు పరోక్షంగా అంగీకరించారు.
అయితే సమాజంలో వ్యక్తులు మరీ సున్నితంగా తయారవుతున్నారని కూడా అభిప్రాయపడ్డారు. ప్రతి చిన్న మాట ను పెద్ద వివాదం చేయడం వల్ల స్వేచ్ఛగా మాట్లాడటం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఉద్దేశ్యం క్యారెక్టర్‌ను విమర్శించడం మాత్రమేనని.. నటుడిని కాదని గతంలోనే వివరణ ఇచ్చినా? నెటిజన్లు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో? అందరూ చూశారని గుర్తు చేశారు. విమర్శలకు , అగౌరవానికి మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకోవడం నేటి కాలంలో సవాలుగా మారిందని అర్షద్ వార్సీ భావిస్తున్నారు.
ఈ వివాదం అర్షద్ వార్సీకి మాత్రమే పరిమతం కాలేదు. సెలబ్రిటీలందరికీ ఓ హెచ్చరికలా నిలిచింది. స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఉండే అభిమాన గణాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం ఎంత అవసరమో? ఈ సంఘటన తెలియజేస్తోంది. నటుల మధ్య ఉండే పరస్పర గౌరవం, ఒకరి సినిమాను మరొకరు విమర్శించేటప్పుడు వాడే పదజాలం విషయంలో నోరు జారేవర్గమంతా మరింత అప్రమత్తంగా ఉంటున్నారు.