అర్జున్ చక్రవర్తి టీజర్: రియల్ గేమ్‌చేంజర్

అర్జున్ చక్రవర్తి పాత్రలో విజయ రామరాజు నటన చాలా నేచురల్ గా వుంది. పెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నీ కలిసి అతడిని ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఫిట్ చేసేశాయి.;

Update: 2025-07-28 07:32 GMT

ఒక టీజర్.. ఒకే నిమిషంలో మనసును కదిలించాలి. సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందని నమ్మకం పెంచాలి. తాజాగా విడుదలైన ‘అర్జున్ చక్రవర్తి' టీజర్ లో ఇవన్నీ కనిపించాయి. పెద్ద సినిమా లాంటి మేకింగ్, బరువైన కథాంశం, గ్రిప్పింగ్ స్పోర్ట్స్ డ్రామా, నిజమైన భావోద్వేగాలు.. అన్నీ కలిపి ఒక పవర్ ఫుల్ మూవీని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారని ఈ టీజర్ రుజువు చేసింది.

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన ‘అర్జున్ చక్రవర్తి’ టీజర్, మొదటి ఫ్రేమ్‌ నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేయించింది. అర్జున్ పాత్ర ఒళ్లు గగుర్పొడిచే ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.


 1980ల కాలంలో భారత కబడ్డీకి స్వర్ణయుగం తీసుకొచ్చిన అర్జున్ చక్రవర్తి జీవితంలోని మలుపులని టీజర్ అద్భతంగా ప్రజెంట్ చేసింది. అర్జున్ జీవితంలో ఆ మలుపు ఎందుకొచ్చింది? మళ్లీ కబడ్డీ కోర్టులోకి అడుగు పెట్టాడా? ఇవన్నీ టీజర్‌లో ఎంతో ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా చూపించారు.

అర్జున్ చక్రవర్తి పాత్రలో విజయ రామరాజు నటన చాలా నేచురల్ గా వుంది. పెర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నీ కలిసి అతడిని ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఫిట్ చేసేశాయి.

దర్శకుడు విక్రాంత్ రుద్ర టీజర్‌ను అద్భుతంగా మలిచారు. ప్రతి సీన్ వెనక ఉన్న భావోద్వేగం ఆడియెన్స్ హృదయాలను తాకుతోంది.

నిర్మాత శ్రీని గుబ్బల ఈ సినిమా పట్ల చూపిన ప్యాషన్ టీజర్ స్పష్టంగా కనిపిస్తోంది.

టెక్నికల్ టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. విఘ్నేష్ బాస్కరన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్ కు ప్రాణం పోశింది. జగదీష్ సినిమాటోగ్రఫీ ఓ ఇంటర్నేషనల్ ఫీల్‌ను ఇస్తోంది.

ఈ సినిమా ఇప్పటికే 46 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం.

‘అర్జున్ చక్రవర్తి’ బిగ్ స్క్రీన్‌ మీద చూడాలన్న క్యురియాసిటీని టీజర్ రెట్టింపు చేసింది. స్పోర్ట్స్ డ్రామాల్లో ఈ సినిమా రియల్ గేమ్‌చేంజర్ అనిపిస్తోంది.

ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Full View
Tags:    

Similar News