ఇండస్ట్రీ పార్టీలు అంటే గిట్టని హాస్య నటుడు
బయటికి కనిపించే రూపం, ప్రవర్తన చూసి మోసపోకూడదు. చూడటానికి పాపులర్ హోస్ట్ అయినా కానీ, అది కేవలం వృత్తి వరకే..తాను సెలబ్రిటీ అంటూ హడావుడి చేయడు.;
బయటికి కనిపించే రూపం, ప్రవర్తన చూసి మోసపోకూడదు. చూడటానికి పాపులర్ హోస్ట్ అయినా కానీ, అది కేవలం వృత్తి వరకే..తాను సెలబ్రిటీ అంటూ హడావుడి చేయడు. అతడు నిజానికి చాలా రిజర్వుడ్ పర్సన్. ఎవరినీ కలిసేందుకు, పబ్లిసిటీ చేసుకునేందుకు ఇష్టపడని వ్యక్తి. కానీ అతడు దేశంలో ఎక్కువమంది వీక్షించే బుల్లితెర కార్యక్రమానికి హోస్ట్. అతడిది నిజంగా చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఒక సాధారణ ఉద్యోగి నుంచి అసాధారణంగా ఆర్జించే స్టార్ గా ఎదిగాడు. అతడి వార్షికాదాయం సుమారు 30కోట్లు.. నికర ఆస్తి 300 కోట్లు. అతడు మరెవరో కాదు.. ది గ్రేట్ కమెడియన్ కపిల్ శర్మ.
బుల్లితెర హోస్ట్ కపిల్ గురించి సహచరులు చెప్పే విషయాలు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. కపిల్ శర్మతో పాటు `ది గ్రేట్ ఇండియన్ కపిల్` షోలో అర్చనా పురాణ్ సింగ్ సహా పలువురు అతడితో పాటు పని చేస్తున్నారు. వారంతా కపిల్‌లోని రిజర్వుడ్ మైండ్ సెట్ గురించి వీలున్నప్పుడల్లా రివీల్ చేస్తున్నారు.
కపిల్ చాలా రిజర్వ్ డ్ పర్సనాలిటీ. ఇప్పుడు నాతో చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడు.. పది మందిలో తొమ్మిది మందితో అతను కంఫర్టబుల్ గా ఉండడు అని చెప్పారు అర్చనా పురాణ్ సింగ్. అతడు తన వ్యక్తిగత జీవితంలో చాలా రిజర్వ్ గా ఉండే వ్యక్తి. ప్రతిదీ గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతాడు. పెద్దగా ప్రచారం చేసుకోవడాన్ని ఎవరూ చూడలేరు. అతడిని కేవలం షోలలో మాత్రమే చూడగలం.. పార్టీలకు వెళ్లడు.. అని అర్చనా చెప్పారు.
హాస్యం మమ్మల్ని కలిపింది. మేమిద్దరం ఒకరి చుట్టూ ఒకరు ఉండటాన్ని ఆనందిస్తామని అర్చనా తెలిపారు. ఒకే రకమైన హాస్యాన్ని అభినందిస్తామని, మా పెంపకం పూర్తిగా భిన్నంగా ఉన్నా కానీ, ఒకరికొకరం కనెక్ట్ అయ్యామని ఆమె తెలిపారు. అర్చన పురాణ్ సింగ్ కపిల్ శర్మ ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ప్రత్యేక న్యాయనిర్ణేతగా ఉన్నారు. ఈ షో రెండవ సీజన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ముగిసింది.