వర్చువల్ AI బ్యాండ్.. రెహ‌మాన్ భారీ ప్ర‌యోగం!

ఇప్పుడు అదే స్ఫూర్తితో అధునాత యుగంలో ఏఐ సాంకేతిక‌త‌ను ఒడిసిప‌ట్టుకుని ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్. రెహ‌మాన్ భారీ ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుడుతున్నారు.;

Update: 2025-09-30 00:30 GMT

దాదాపు రెండున్న‌ర ద‌శాబ్ధాల క్రిత‌మే వ‌ర్కువ‌ల్ మూవింగ్ ఇమేజ్ ఎలా మ‌నుషుల్లో క‌లిసిపోగ‌ల‌దో, ప్రాక్టిక‌ల్ గా తెర‌పై చూపించి అబ్బుర ప‌రిచారు ద‌ర్శ‌కుడు శంక‌ర్. `జీన్స్` సినిమాలో అచ్చు గుద్దిన‌ట్టు ఐశ్వ‌ర్యారాయ్ ని పోలిన మ‌రో ట్విన్ ఐశ్వ‌ర్యారాయ్‌ ని గ్రాఫిక్స్ లోనే క్రియేట్ చేసారు. క‌న్నుల‌తో చూసేది గురువా! అంటూ వ‌ర్చువ‌ల్ ఐష్ ఒరిజిన‌ల్ హ్యూమ‌న్ ఐశ్వ‌ర్యారాయ్ తో క‌లిసి డ్యాన్స్ చేస్తుంది. ఆ పాట సృష్టి ఒక అద్భుత మాయాజాలం! అంటూ ప్ర‌జ‌లు కీర్తించారు. శంక‌ర్ లాంటి మేధావి మ‌రొక‌రు లేరు! అంటూ కితాబిచ్చారు.

అధునాత‌న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని సినిమాల‌ను తీయ‌డంలో సుప్ర‌సిద్ధుడైన శంక‌ర్ ఇటీవ‌లి కాలంలో స్క్రిప్టు మ్యాట‌ర్స్ లో పూర్తిగా గాడి త‌ప్పుతున్నారు. శంక‌ర్ కంటే ముందే, ద‌శాబ్ధాల క్రిత‌మే హాలీవుడ్ లో ప్రిడేటర్, మ్యాట్రిక్స్, రెసిడెంట్ ఈవిల్ ఫ్రాంఛైజీల్లో, ఇంకా చాలా ఫ్రాంఛైజీ చిత్రాల్లో ఏఐ ఆధారిత వ‌ర్చువ‌ల్ విజువ‌ల్స్ మాయాజాలం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు అదే స్ఫూర్తితో అధునాత యుగంలో ఏఐ సాంకేతిక‌త‌ను ఒడిసిప‌ట్టుకుని ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్. రెహ‌మాన్ భారీ ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుడుతున్నారు. దాదాపు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఎఆర్ రెహమాన్ కొత్త రకమైన సింఫనీతో మళ్ళీ అబ్బురపరుస్తానని హామీ ఇస్తున్నాడు. `సీక్రెట్ మౌంటైన్` పేరుతో మెటావర్స్‌లో వర్చువల్ ఏఐ-ఆధారిత బ్యాండ్ ని ప్రారంభించాల‌ని సంక‌ల్పించారు. ఇటీవ‌ల అమెరికాలో ఓపెన్‌ఏఐ సృష్టిక‌ర్త‌ సామ్ ఆల్ట్‌మన్, ప‌ర్ ఫ్లెక్సిటీ అరవింద్ శ్రీనివాస్‌లను రెహ‌మాన్ కలిశారు. ఆ త‌ర్వాత ప‌లు ఊహాగానాలకు దారితీసాయి.

రేడియంట్ సోల్స్ అనే కంపెనీ ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ AI దిగ్గజాలతో భాగస్వామ్యాలకు ప్లాన్ చేస్తోందని రెహమాన్ అన్నారు. సీక్రెట్ మౌంటైన్ ప్రాథమికంగా ఒక వర్చువల్ బ్యాండ్. నేను దీనిని ఒక సంగీత బ్యాండ్ రూపంలో ఐక్యరాజ్యసమితిగా చూస్తున్నాను . ఇది ప్రపంచాన్ని ఏకం చేయడానికి విభిన్న సంస్కృతులను ఒకచోట చేర్చుతుంది అని రెహమాన్ అన్నారు. సీక్రెట్ మౌంటైన్‌ను ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతిగా భావించవచ్చని రేడియంట్ సోల్స్ చెబుతోంది

ఆస్కార్‌ల కోసం అతను లాస్ ఏంజిల్స్‌లో ఉన్నప్పుడు ఈస్ట్ ధృక్ప‌థాన్ని ఆవిష్క‌రించే పాశ్చాత్య బ్యాండ్‌ను ప్రారంభించాలనే ఆలోచన చేసారు రెహమాన్‌. అప్పుడు ఇది విజయవంతం కాకపోయినా, కోవిడ్ సమయంలోను కొత్త ప్ర‌య‌త్నం చేసాడు. భారతదేశం నుండి ప్రపంచానికి ఏదైనా ఇవ్వడానికి నేను దీనిని ఒక మార్గంగా భావిస్తున్నాను. మనలాగే ప్రత్యేకమైనది వైవిధ్యమైనది ఇవ్వాల‌నుకున్నాను అని రెహ‌మాన్ తెలిపారు. రెహ‌మాన్ మిష‌న్ ఏడాది క్రిత‌మే ప్రారంభ‌మైంది. ఏఐ గురించి ఇంతగా చ‌ర్చించ‌ని రోజుల్లోనే రెహ‌మ‌న్ ఏఐ గురించి ఆలోచించారు. క‌ళాకారుల స్థానంలో ఏఐని ఉప‌యోగించ‌డం కాదు కానీ, మాన‌వుల సాయంతో ఏఐలో ఉత్త‌మమైన‌దానిని సృజించ‌డం అని చెబుతున్నారు.

అయితే ఈ సంగీతం జ‌న‌రేటివ్ కాదు.. సాహిత్యం క‌ల్పిత‌మైన‌ది కాదు.. సంగీతం-సాహిత్యం, స్వ‌రం ఇవ‌న్నీ మాన‌వీయ‌మైన‌వి. AI చేసేది ఏమిటంటే, కేవ‌లం పనిని వేగవంతం చేయడం మాత్ర‌మే. అవుట్‌పుట్ మ‌రింత అందంగా వ‌స్తుంద‌ని రెహ‌మాన్ చెప్పారు. ఏఐ ఆధారిత బ్యాండ్ ఏమేర‌కు విజ‌యం సాధిస్తుందో వేచి చూడాలి.

మెటావ‌ర్స్ అనేది ఒక సామూహిక వ‌ర్చువ‌ల్ స్పేస్. ఇందులో డిజిట‌ల్ అవ‌తార్ లు వ‌ర్చువ‌ల్ గా సంభాషిస్తాయి. పాడ‌తాయి... వ‌ర్చువ‌ల్ రియాలిటీ (వీఆర్)- ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) క‌ల‌యిక‌తో ఇది ప‌ని చేస్తుంది. రెహ‌మాన్ ఈ సాంకేతిక‌త‌తో పాట‌ల‌ను క్రియేట్ చేస్తారు.

Tags:    

Similar News