ఫిల్మ్ మేకింగ్‌పై రెహ‌మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

రీసెంట్‌గా ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన రెహ‌మాన్ రీమిక్స్‌ల‌తో పాటు నేటి ఫిల్మ్ మేకింగ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.;

Update: 2025-06-20 20:30 GMT

ఆస్కార్ అవార్డ్ విన్నిర్ ఏ.ఆర్‌.రెహ‌మాన్ త‌న‌దైన మార్కు మ్యాజిక్‌తో భార‌తీయ సంగీత ప్ర‌పంచంలో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ఇండియ‌న్ మ్యూజిక్‌ని ఆస్కార్ వ‌ర‌కు తీసుకెళ్లి ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుని ఇండియా ఒడిలో చేర్చి అరుదైన ఘ‌న‌త‌ని సొంతం చేసుకున్నారు. రీసెంట్‌గా క‌మ‌ల్‌, మ‌ణిరత్నంల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `థ‌గ్ లైఫ్‌`కు మ్యూజిక్ చేశారు. ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కథానాయ‌కుడిగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న `పెద్ది`కి వ‌ర్క్ చేస్తున్నారు.

రీసెంట్‌గా ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన రెహ‌మాన్ రీమిక్స్‌ల‌తో పాటు నేటి ఫిల్మ్ మేకింగ్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. రీమిక్స్ ల‌ని త‌ర‌చూ ఎలా చేస్తార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అంతే కాకుండా ఇండ‌స్ట్రీ పాటిస్తున్న ప్ర‌మాణాలు, సృజ‌నాత్మ‌క‌త‌పై కూడా ఆయ‌న స్పందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన మార్కు ఐకానిక్ సాంగ్స్‌ని అందించి ఆ విష‌యంలో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకుని కోట్ల మంది సంగీత ప్రియుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.

నేటి చిత్ర నిర్మాణంతో పోలిస్తే ఆనాటి మేకింగ్ చాలా అమాయ‌క‌త్వంతో వ‌ర్క్ మీదున్న ప్రేమ‌తో సాగేద‌ని, అయితే ఇప్ప‌డు అలా లేద‌ని, చాలా వ‌ర‌కు అంతా లెక్క‌లు వేసుకుని వ‌ర్క్ చేస్తున్నార‌ని, త‌మ‌కు ఏం కావాలో ఆనే టెంప్లెట్‌ని ముందే సెట్ చేసుకుని దాని ప్ర‌కారం ప‌ని చేస్తున్నార‌ని వాపోయారు. ఆనాటితో పోలిస్తే ప్రస్తుత ఫిల్మ్ మేక‌ర్స్‌కి ఏం కావాలో ముందే తెలుస‌న్నారు. ఇది మంచి విష‌య‌మేని అయితే వారు ఉన్న‌దాన్నే రిపీటెడ్‌గా కోరుకోవ‌డం మంచి విష‌యం కాద‌ని రీమిక్స్‌ల గురించి వివ‌రించారు.

నేటి రోజుల్లో ఆధునిక క‌థ చెప్ప‌డం చాలా సులువైంద‌ని, అయితే ఇది చెడు సంకేతాల్ని అందిస్తోంద‌ని, తాజా ద‌నాన్ని సృజ‌నాత్మ‌క‌త‌ను అది దెబ్బ‌తీస్తుంద‌ని రెహ‌మాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ థోర‌ణి బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ క‌నిపిస్తోంద‌న్నారు. నేటి త‌రం ప్రేక్ష‌కులు రీమిక్స్‌తో పాటు సృజ‌నాత్మ‌క‌మైన ఆలోచ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని, అయితే ఇండియ‌న్ ఫిల్మ్ మేకింగ్ గురించి ఆందోళ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఈ జాడ్యం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉంద‌న్నారు.

చాలా వ‌ర‌కు డ‌బ్బు మాత్ర‌మే కావాల‌ర‌ని కోరుకుంటున్నార‌ని, మిగ‌తా వారు మాత్రం ఇండిపెండెంట్ మూవీస్‌ని కోరుకుంటున్నార‌ని, నేటీకీ విలువ‌ల‌తో ఊడుకున్న సినిమాల కోసం రిస్క్‌లు చేస్తున్నార‌న్నారు. రెహ‌మాన్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తొలి సారి రామ్ చ‌ర‌ణ్ `పెద్ది`కి రెహ‌మాన్ సంగీతం అదిస్తుండం, చ‌ర‌ణ్ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఇప్ప‌టికే తారా స్థాయికి చేరి రికార్డు స్థాయి నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్‌ని అందించ‌డం విశేషం.

Tags:    

Similar News