పెద్ది కోసం అన్నీ పక్కన పెట్టిన రెహమాన్
అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే, చాలా ఏళ్ల తర్వాత ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాపై రెహమాన్ ఈ రేంజ్ ఎగ్జైట్‌మెంట్ చూపిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్న పెద్ది సినిమాపై ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీ దృష్టి పడేలా చేసిన పేరు ఏఆర్ రెహమాన్. ఈ సినిమా నుంచి ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ సోషల్ మీడియాలో చార్ట్‌బస్టర్‌గా మారగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ గురించి వస్తున్న అప్డేట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ముఖ్యంగా రెహమాన్ ఇతర ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టి పూర్తిగా పెద్ది మీదే ఫోకస్ పెట్టారన్న వార్తలు ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఇప్పటికే టీమ్‌కు అందించిన రెహమాన్ ప్రస్తుతం సెకండ్ హాఫ్ స్కోర్ కోసం ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒకేసారి పలువురు డైరెక్టర్లతో బిజీగా ఉండే రెహమాన్, ఈసారి మాత్రం పెద్ది కోసం ఎక్కువ సమయం కేటాయించడం విశేషంగా మారింది.
అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే, చాలా ఏళ్ల తర్వాత ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాపై రెహమాన్ ఈ రేంజ్ ఎగ్జైట్‌మెంట్ చూపిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పెద్దికి మంచి మ్యూజిక్ ఇచ్చి, తద్వారా మరింత బిజీ అవాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన చెప్పిన కథ, గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామా ఎమోషన్స్ రెహమాన్‌ను బాగా ఆకట్టుకున్నాయని సమాచారం. కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన ఆయన, సినిమా టోన్‌కు తగ్గట్టుగా సంగీతాన్ని డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన తీసుకుంటున్న కేరింగ్ టీమ్‌ను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందని చెబుతున్నారు.
రీసెంట్ గా ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కూడా రెహమాన్ సినిమా గురించి ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్, సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండింగ్ కూడా ఇప్పుడు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో, త్వరలో రిలీజ్ కానున్న ఐటమ్ సాంగ్‌పై కూడా భారీ హైప్ నెలకొంది. మరోవైపు రామ్ చరణ్ కెరీర్‌లో పెద్ది మ్యూజిక్ ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.
స్పోర్ట్స్ డ్రామాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత కీలకమో గతంలో అనేక సినిమాలు నిరూపించగా, ఇప్పుడదే మ్యాజిక్‌ను రెహమాన్ పెద్దిలో చూపించబోతున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్, స్పోర్ట్స్ హై ఇంటెన్సిటీ సన్నివేశాలకు ఆయన ఇచ్చే సంగీతం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్ చేయగా, ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 4వ తేదీన పెద్ది ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.