అన్వేష్ కు ఇంకో షాక్.. ఏం జరుగుతుందో?
అయితే అన్వేష్ ప్రస్తుతం ఫారిన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తం వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ (NCW)కు బదిలీ చేసింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్.;
తెలుగు యూట్యూబర్ అన్వేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు.. అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు అందజేయాలంటూ ఇన్ స్టాగ్రామ్ నిర్వాహకులను కోరారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు అన్వేష్ పై ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. యూట్యూబ్ ఛానల్ లో మహిళలను అవమానించే, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ పలువురు కంప్లైంట్ చేశారు. మహిళలను వస్తువుల్లా చూపిస్తూ తన ఛానెల్స్ తో కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాడని తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
ఇప్పుడు తమకు అందిన ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టి సారించింది. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలతో పాటు, బాలల హక్కులకు భంగం కలిగించే కంటెంట్ కూడా ఉందని ఫిర్యాదులు అందడంతో సీరియస్ గా వ్యవహరించింది. అన్వేష్ ఇప్పటికే పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్ ను పరిశీలించినట్లు తెలుస్తోంది.
అందులో చట్ట విరుద్ధమైన ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని గుర్తించిందట. సంబంధిత వీడియో లింకులు, సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా సేకరించింది. అన్వేష్ కు చెందిన కొంత కంటెంట్ ప్రజా నైతికతకు భంగం కలిగించడమే కాకుండా, సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తుందని మహిళా కమిషన్ అభిప్రాయపడింది.
అయితే అన్వేష్ ప్రస్తుతం ఫారిన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తం వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ (NCW)కు బదిలీ చేసింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్. అన్వేష్ పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని NCWను కోరింది. మహిళల గౌరవం, సామాజిక విలువల పరిరక్షణ తమ ప్రధాన లక్ష్యమని తెలిపింది.
అసలేం జరిగిందంటే?
రీసెంట్ గా సినీ నటుడు శివాజీ.. హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై కొన్ని వ్యాఖ్యలు చేయగా.. వాటిపై అన్వేష్ స్పందించాడు. ఆ సమయంలో సీతమ్మ తల్లితోపాటు ద్రౌపదిపై చేసిన అతడు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అనేక మంది నెటిజన్లను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో అతడిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్వేష్ వ్యాఖ్యలు చేసిన క్షణం నుంచి ఇప్పటి వరకు.. భారీ సంఖ్యలో అతడి సబ్స్కైబర్స్.. అన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ అతడు మాత్రం ఇంకా వీడియోలు చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా పెట్టిన మరిన్ని వీడియోలు పట్ల మళ్లీ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.