ప్రభాస్‌-అనుష్క... ఏడులో ఒకటి?

బాహుబలి తర్వాత ప్రభాస్‌ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ఆయన వరుస సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే.;

Update: 2025-04-25 11:30 GMT

బాహుబలి తర్వాత ప్రభాస్‌ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌ అయ్యాడు. ఆయన వరుస సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్ రాబోయే రోజుల్లో ఏడాదికి రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అదే బాహుబలి సినిమాలో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న అనుష్క మాత్రం పెద్దగా సినిమాలను చేయడం లేదు, చేసిన కొన్ని సినిమాలు నిరాశ పరుస్తూ వస్తున్నాయి. అనుష్క సినిమాలను కమిట్‌ అయ్యేందుకు మీనమేషాలు లెక్కిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అనుష్క కి ఉన్న క్రేజ్‌ను సద్వినియోగం చేసుకుని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తే బాగుంటుందని అభిమానులు అంటూ ఉంటారు.

అనుష్క చివరిగా 2023లో 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సమ్మర్‌లో ఈమె నటించిన 'ఘాటి' సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను విడుదల చేయలేక పోతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఘాటి సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య కాలంలో అనుష్క సినిమాలు ఏమీ రాకున్నా కూడా ఆమెకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఘాటి సినిమాకు సాలిడ్‌ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. సరైన సమయంలో సినిమా విడుదల అయితే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు కావడం సాధ్యమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఘాటి సినిమా మాత్రమే కాకుండా మలయాళంలోనూ అనుష్క ఒక సినిమాను చేస్తోంది. ఆ సినిమా కూడా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా అనుష్క మరో నాలుగు అయిదు సినిమాలకు కమిట్ అయిందని, ఆ సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వస్తాయని సమాచారం అందుతోంది. అనుష్క గురించి ఒక జాతీయ మీడియా సంస్థ తన కథనంలో అనుష్క వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు అంటూ పేర్కొంది. దాంతో అనుష్క సినిమాలు ఏంటి, ఆ సినిమాలకు సంబంధించిన విశేషాలు ఏంటి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సెర్చ్‌ చేస్తున్నారు.

అనుష్క మొత్తం ఏడు సినిమాలు చేస్తుందని, ఆ ఏడు సినిమాల్లో ఒకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ హీరోగా రూపొందబోతున్న సినిమాలో అనుష్క ప్రముఖ పాత్రలో కనిపించబోతుంది అనేది పుకారు. ఆ పుకారు విషయంలో క్లారిటీ లేదు.. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరు మరోసారి కలిసి నటిస్తే చూడాలని ఆశ పడుతున్నారు. త్వరలోనే ఆ కోరిక తీరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ - అనుష్క జంటగా సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబోలో మూవీ అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News