అనుష్క శెట్టి.. ఈ పేరు పెట్టడం వెనుక ఇన్ని చర్చలా?
అనుష్క శెట్టి.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని.. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.;
అనుష్క శెట్టి.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని.. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనుష్క శెట్టి.. ఆ తర్వాత వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ ఊహించని క్రేజ్ అందుకుంది. ఒకవైపు నటనతో ఆకట్టుకుంటూనే.. మరొకవైపు గ్లామర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైస్ చేసిన అనుష్క శెట్టి.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించిన ఈమె బాహుబలి వంటి చిత్రాలలో రాజసం ఉట్టిపడే పాత్రలలో నటించి ఔరా అనిపించింది.
ఇలా చెప్పుకుంటూ పోతే అనుష్క శెట్టి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడిన తర్వాత ఆచితూచి అడుగులు వేస్తూ.. చాలా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ బిజీగా మారింది. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈమె చేసిన భాగమతి, నిశ్శబ్దం, సైజ్ జీరో వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా చేసింది అనుష్క. ఆ తర్వాత కొంతకాలం మళ్లీ గ్యాప్ తీసుకున్న ఈమె ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'ఘాటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రస్తుతం ఈమె 'కల్కి 2' సినిమాలో నటించే అవకాశం ఉంది అంటూ ఒకవైపు వార్తలు వినిపిస్తూ ఉండగా.. మరొకవైపు అనుష్క శెట్టిగా మారడం వెనక అసలు విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి స్వీటీ శెట్టి అనుష్క శెట్టిగా ఎలా మారింది? సూపర్ సినిమా టైటిల్ కార్డ్స్ లో పేరు మార్చడం వెనుక ఎవరి హస్తముంది ? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
తాజాగా ఒక పాత వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో అనుష్క మాట్లాడుతూ.." నా అసలు పేరు స్వీటీ శెట్టి. మొదటి సినిమాలో కూడా స్వీటీ శెట్టి అనే ఉంది. అయితే సూపర్ సినిమా కోసం పేరు మార్చుకోవాలి అనుకున్నాను. అప్పుడు మా నాన్న, నాగార్జున గారు ఇద్దరు నన్ను స్మృతి శెట్టి అని పెట్టుకోమని సలహా ఇచ్చారు. అయితే ఆ పేరు మాత్రం నాకు పెద్దగా నచ్చలేదు. పైగా ఆ పేరు పలికేటప్పుడు ముక్కు దగ్గరగా వెళుతుంది. దాంతో నాకు ఆ పేరు నచ్చలేదు. అందుకే వారు చెప్పినట్టు ఆ పేరు నేను పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. నిజానికీ ఎంతమందికి తమ పేరును మార్చుకునే అదృష్టం వస్తుంది చెప్పండి.. కానీ నాకు ఆ అదృష్టం వచ్చింది. అలా ఫైనల్ గా నేను అనుష్క శెట్టిగా ఫిక్స్ అయ్యాను" అంటూ తన పేరు వెనుక జరిగిన అసలు చర్చ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది అనుష్క.