• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఘాటీ' ఫస్ట్ లుక్:...

'ఘాటీ' ఫస్ట్ లుక్: స్మోకింగ్ చేస్తూ భయపెడుతున్న అనుష్క!

| ఇప్పటికే అనేక మెమరబుల్ క్యారెక్టర్స్ ప్లే చేసిన స్వీటీ.. ఇప్పుడు ''ఘాటీ'' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది

By - Tupaki Desk
Update: 2024-11-07 05:35 GMT

సౌత్ క్వీన్ అనుష్క శెట్టి గత రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తోంది. ఓవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, ఇంకో పక్క విమెన్ సెంట్రిక్ సినిమాలతో సత్తా చాటుతోంది. 'అరుంధతి' 'రుద్రమదేవి' 'భాగమతి' వంటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఈ సీనియర్ బ్యూటీ.. స్టార్ హీరోల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే అనేక మెమరబుల్ క్యారెక్టర్స్ ప్లే చేసిన స్వీటీ.. ఇప్పుడు ''ఘాటీ'' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ''ఘాటీ''. 'వేదం' తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమా ఇది. ఈరోజు (నవంబర్ 7) అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ తాజాగా ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ''రాణి ఇప్పుడు ఘాటిని పరిపాలిస్తుంది'' అని పేర్కొన్నారు. ఇందులో రక్తం కారుతున్న చేతులతో, స్మోకింగ్ చేస్తూ భయంకరమైన అవతార్ లో కనిపిస్తోంది అనుష్క. చూస్తుంటే ఆమె చేతిలో ఉన్నది గంజాయి పాట్ లా అనిపిస్తోంది.

''ఘాటీ'' ఫస్ట్ లుక్ లో అనుష్క కంప్లీట్ మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేసి సర్ప్రైజ్ చేసారు. అదే సమయంలో ఆమె కళ్ళలో కోపం, క్రోధం చూస్తే.. దుర్మార్గులను వధించే దేవతలాగా కనిపిస్తుంది. ఈ పోస్టర్ కు "విక్టిమ్, క్రిమినల్, లెజెండ్" అనే ట్యాగ్ లైన్‌ని మేకర్స్ ఉపయోగించారు. ఇది సినిమాలో ఆమె పాత్ర యొక్క ఆర్క్ ను సూచిస్తోంది. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలు.. నేర ప్రపంచాన్ని పరిపాలించే రాణిగా, ఒక లెజెండ్ గా ఎలా ఎదిగిందనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

'వేదం' సినిమాలో అనుష్కని ఒక వేశ్య పాత్రలో అద్భుతంగా చూపించిన దర్శకుడు క్రిష్.. ''ఘాటీ'' మూవీలో పవర్ ఫుల్ మాస్ క్యారక్టర్ లో ప్రెజెంట్ చేయబోతున్నట్లు టెర్రిఫిక్ ఫస్ట్ లుక్ తోనే అర్థమవుతోంది. ఇది సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. మేకర్స్ ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఆసక్తికరమైన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు. దీనితో సినిమాలో అనుష్క పాత్రపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

'ఘాటీ' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ కాన్వాస్‌లో నిర్మిస్తున్నాయి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, వై రాజీవ్ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

Tags:    
  • Krishjagarlamudi 
  • Anushkashetty 
  • Ghaatifirstlook 
  • Anushkaghaati 
  • Tollywood 
  • Uvcreations 
  • Ghaatimovie 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS