• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హరి హర వీరమల్లు.....

హరి హర వీరమల్లు.. రంగంలోకి మరో బాలీవుడ్ స్టార్

| బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్న పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

By - Tupaki Desk
Update: 2024-08-08 13:05 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న సిషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైనప్పటికీ చివరికి యువ దర్శకుడు జ్యోతి కృష్ణ చేతికి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన 20 శాతం షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది.

 

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎం. రత్నం సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఫ్యాన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పవన్ కల్యాణ్ అభిమానులు టీజర్‌ను చూసి సినిమాపై మరింత ఆసక్తితో ఉన్నారు. ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి, తాజాగా మేకర్స్ మరో కీలక అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో స్టార్ యాక్టర్ కూడా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్న పాత్రకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది.

ఆయనతో పవన్ కళ్యాణ్ తొలిసారిగా కలిసి నటించబోతున్నారు. ఇద్దరు అగ్ర నటుల కలయిక ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చే అవకాశం ఉందని, ప్రేక్షకులు ఈ కాంబినేషన్‌ ను తెరపై చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ తాజా పోస్టర్ విడుదలతో, సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అవ్వడంతో, ఈ అప్డేట్ అభిమానులను మరింతగా ఉత్సాహపరిచింది.

నిర్మాతల ప్లాన్ ప్రకారం, చిత్రబృందం ప్రస్తుతం మిగతా భాగం చిత్రీకరణ కోసం లొకేషన్ల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందని చెప్పారు, 'హరి హర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ vs స్పిరిట్' పేరుతో మొదటి భాగంగా తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోందని సమాచారం. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్‌లో మరింత ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    
  • Hariharaveeramallu 
  • Anupamkher 
  • Pawankalyan 
  • Krish 
  • Niddhiagerwal 
  • Bobbydeol 
  • Movieshooting 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS