సినిమా రివ్యూలు.. అనుపమ ఏమందంటే?
అదే సమయంలో అనుపమ.. రివ్యూలపై ఇటీవల చేసిన కామెంట్స్ తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిందనే చెప్పాలి.;
మాలీవుడ్ బ్యూటీ, యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో నటిస్తున్న తెలుగు మూవీ పరదా. లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఆ చిత్రానికి సినిమా బండి ఫేం ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటి దర్శన, సంగీత మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు.
స్పెషల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న పరదా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకోగా, ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించనుందని సెన్సార్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మేకర్స్ కూడా సినిమాపై నమ్మకంతో ఉన్నారు. హిట్ అవుతుందనే ధీమాతో ప్రమోషన్స్ తో బిజీబిజీగా గడుపుతున్నారు.
అదే సమయంలో అనుపమ.. రివ్యూలపై ఇటీవల చేసిన కామెంట్స్ తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగిందనే చెప్పాలి. పరదా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ఆమె వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలు అనుపమ పరమేశ్వరన్ ప్రమోషన్స్ లో ఏమందంటే?
తన సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలు వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పారు. డే 1 నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ చెప్పారు. ఆగస్టు 22వ తేదీన అందరూ సినిమా చూడండని కోరారు. నచ్చితే ఫ్రెండ్స్ కు సజ్జెస్ట్ చేయడంని చెప్పారు. కాబట్టి ఒకవేళ రివ్యూస్ చూసి బాగుంటే అందరూ సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండని అన్నారు.
సింపుల్ గా.. సినిమా రివ్యూస్ బాగా లేకుంటే సంతోషంగా పరదా చిత్రాన్ని పక్కన పెట్టేయండని పరోక్షంగా చెప్పారు. ఆమె కామెంట్స్ మూవీ వరల్డ్ లోని ముఖ్య అంశాన్ని హైలైట్ చేస్తున్నాయి. చిత్ర నిర్మాతలు నిజంగా మంచి సినిమా తీయడంపై మాత్రమే దృష్టి పెడితే, సమీక్షలను నిందించాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పాయి అనుపమ పరమేశ్వరన్ వ్యాఖ్యలు.
అయితే పరదా వంటి చిన్న సినిమాలకు ప్రారంభ సమీక్షలు, ప్రేక్షకుల ప్రతి స్పందనలు ఆసక్తి కలిగించడానికి, టిక్కెట్లు అమ్మకానికి దోహదపడతాయి. కేవలం హైప్ క్రియేట్ చేయడమే లక్ష్యం కాకుండా.. ఉన్న విషయంపై స్పష్టంగా సరైన విధంగా కామెంట్స్ చేశారు అనుపమ. మరి పరదా సినిమా ఎలా ఉంటుందో.. అనుపమకు ఎలాంటి హిట్ అవుతుందో.. ఆమె కామెంట్స్ ఎంతవరకు కలిసి వస్తాయనేది చూడాలి మరి.