పెళ్లి విషయంలో ఓపెన్ అయిన ముద్దుగుమ్మ
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఒకటి రెండు షూటింగ్ దశలో ఉంటే కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.;
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది. 2015 సంవత్సరంలో మలయాళం మూవీ ప్రేమమ్‌తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసింది. కెరీర్ ఆరంభంలో ఈ అమ్మడు మలయాళ సినిమాలకే పరిమితం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ లక్కీగా ఈ అమ్మడికి మొదటగా తమిళ్‌లో కోడి అనే సినిమాలో ఛాన్స్ దక్కింది. ఆ సినిమా తర్వాత తెలుగులో అ ఆ, ప్రేమమ్ సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయింది. టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే మంచి స్టార్డం దక్కించుకుంది. అ ఆ సినిమాలో అనుపమ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అంతా ఆమెను అభిమానించడం మొదలు పెట్టారు, ఆ తర్వాత ప్రేమమ్ సినిమా ఆమె స్థాయిని మరింతగా పెంచేసింది.
ప్రేమమ్‌తో టాలీవుడ్‌లో ఎంట్రీ
తెలుగులో ఈమె 2017లో చేసిన శతమానం భవతి సూపర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసే అవకాశం రాలేదు. ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్, మలయాళం ఇలా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిన హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నిలిచింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సైతం ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఈమె పరదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో మంచి కాన్సెప్ట్‌ను చూపించినా కమర్షియల్‌గా నిరాశ పరిచింది. అయినా కూడా ఈ అమ్మడి క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఒకటి రెండు షూటింగ్ దశలో ఉంటే కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
అనుపమ పరమేశ్వరన్ పెళ్లి విషయంలో...
ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో వచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి విషయమై ఓపెన్ అయింది. మూడు పదుల వయసుకు చేరువ అవుతున్న నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి ఎప్పుడు అంటూ చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉందనే వార్తలు తెగ వచ్చాయి. కానీ అవి పుకార్లే అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఒక చిట్ చాట్ సందర్భంగా ప్రేమ వివాహం గురించి స్పందించి అందరిని సర్‌ప్రైజ్ చేసింది. ప్రేమలో లేదని అంతా అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈ అమ్మడు తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అని చెప్పడం ద్వారా కచ్చితంగా ఈమె ప్రేమలో ఉందని కొత్త ప్రచారం మొదలు అయింది. అయితే ఆమె మాత్రం ప్రేమ ఉన్నట్లు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
లవ్ మ్యారేజ్‌పై అనుపమ క్లారిటీ
కుటుంబ సభ్యులను ఒప్పించిన తర్వాత మాత్రమే తాను ప్రేమ వివాహం చేసుకుంటాను అన్నట్లుగా అనుపమ చెప్పడంతో ఆమె పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చినట్లు అయింది. అయితే ప్రస్తుతానికి ప్రేమలో ఉన్నారా అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది. ప్రేమ వివాహం చేసుకుంటాను అని చెప్పడం ద్వారా ఇప్పటికే ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే, కొందరు మాత్రం ఆమె భవిష్యత్తులో ప్రేమలో పడితే ఫ్యామిలీ మెంబర్స్‌ను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా చెప్పిందని, అంత మాత్రాన ఆమె ప్రేమలో ఉన్నట్లుగా ఎలా చెబుతారు అంటూ కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆమెకే తెలియాలి. మొత్తానికి ప్రేమ వివాహం విషయంలో ఆమె తన అభిప్రాయంను ఓపెన్‌గా చెప్పడం ద్వారా ఎప్పుడు జరిగినా అనుపమ పెళ్లి ప్రేమ పెళ్లి అనే విషయంలో క్లారిటీ వచ్చింది.