ఇంటర్వ్యూ కెమెరా అంటే కాళ్లు చేతులు ఒణికిపోతాయ్!
మాలీవుడ్ బ్యూటీ అనుపమపరమేశ్వరన్ కెరీర్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.;
మాలీవుడ్ బ్యూటీ అనుపమపరమేశ్వరన్ కెరీర్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, మలయాళ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే చేతిలో ఐదారు సినిమా లున్నాయి. కొచ్చి టూ హైదరాబాద్ రౌండ్లు వేస్తోంది. దీంతో అనుపమ ఏ క్షణం ఎక్కడ ఉంటుందో కూడా తెలియడం లేదు. ఒ కేసారి అన్ని సినిమాలు ఆన్ సెట్స్ లో ఉండటంతో? ప్రయాణాలు తప్పడం లేదు.
ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకూ కెమెరా ముందే ఎక్కువగా ఉంటుంది. సెట్ లో కెమెరా ముందు నిరంతరం పనిచేస్తూనే ఉంది. అలాంటి బ్యూటీ కి మీడియా కెమెరా ముందుకొచ్చే సరికి ఒక్కసారిగా కాళ్లు చేతులు ఆడుతాయి? అంటూ షాక్ ఇచ్చింది. అవును ఆన్ సెట్స్ లో సినిమా కెమెరా ముందు ఓపది పేజీల డైలాగులు గుక్క తిప్పకుండా చెప్పగలను. కానీ అదే కెమెరా మీడియా వాళ్లది అయితే మాత్రం నోట మాట రాదంటోంది.
కాళ్లు, చేతులు గడగడా ఒణుకుతాయని అంటోంది. అలాగే ఫోటో షట్ కెమెరాలన్నా? కూడా అంతే ఆందోళనకు గురవుతానని తెలిపింది. ఎందుకనో ఈ రెండు కెమెరాలు అంటే తనకో ఫోబియోలా మారిపో యిందన్నారు. ఇలా భయపడటం సరైన పద్దతి కాదని తెలిసినా? తనను తాను మార్చుకోలేకపోతున్నానని తెలిపింది. అలాగే భవిష్యత్ ప్రణాళిక గురించి కూడా రివీల్ చేసింది.
రెగ్యులర్ పాత్రలకంటే రొటీన్ కి భిన్నమైన పాత్రలో పోషించాలని స్ట్రాంగ్ గా డిసైండ అయిందిట. `టిల్లు స్క్వేర్`, `రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్` లాంటి చిత్రాల్లో పాత్రలు వైవిథ్యంగా ఉండటం తనకి ఎనలేని గుర్తిం పును తెచ్చి పెట్టాయని తెలిపింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతోనే గొప్ప అనుభూతి పొందు తున్నట్లు తెలిపింది.