అనుపమ 'క్రేజీ కళ్యాణం'.. మరో శతమానం భవతి!

బ్లాక్ బస్టర్ శతమానం భవతి సినిమా ప్రమోషన్స్ చేసిన సమయంలో తనకు ఒక స్పెషల్ వైబ్స్ వచ్చాయని అనుపమ చెప్పారు.

Update: 2026-10-15 03:58 GMT

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, యాక్టర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ కళ్యాణం. భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఆ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఆ సినిమాను జగన్ మోహన్ రెడ్డి గ్రాండ్ గా నిర్మించారు. అయితే రీసెంట్ గా హైదరాబాద్‌ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో అనుపమ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బ్లాక్ బస్టర్ శతమానం భవతి సినిమా ప్రమోషన్స్ చేసిన సమయంలో తనకు ఒక స్పెషల్ వైబ్స్ వచ్చాయని అనుపమ చెప్పారు. ఇప్పుడు క్రేజీ కళ్యాణం విషయంలో కూడా అలాంటి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తోందన్నారు. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి చాలా నమ్మకంగా ఉన్నానని తెలిపారు. దర్శకుడు భద్రప్ప గాజులపై తనకు ఎంతో గౌరవం ఉందని అనుపమ చెప్పారు. ఆయన వల్లే సినిమా చేయడానికి ఓకే చెప్పానని అన్నారు.

నిర్మాత జగన్ ఎంతో ఇంట్రెస్ట్ తో సినిమాను రూపొందించారని ప్రశంసించారు. క్రేజీ కళ్యాణం ప్రాజెక్టును ఆయన ఎప్పుడూ చిన్న ప్రాజెక్ట్‌లా చూడలేదని, భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు కష్టపడ్డారని చెప్పారు. ఇలాంటి డెడికేషన్ ఉన్న నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకున్నారు. ఆయన ఎప్పుడూ క్రేజీ కళ్యాణం మూవీని చిన్న సినిమాలా చూడలేదని, బాహుబలిగానే భావించారని చెప్పారు.

క్రేజీ కళ్యాణం మూవీ టెక్నీషియన్స్ వర్క్ ను అనుపమ స్పెషల్ గా ప్రస్తావించారు. తన హెల్త్ బాగోలేని సమయంలోనూ కెమెరా డిపార్మెంట్ తనకు ఎంతో సహకరించిందని చెప్పారు. సురేష్ బొబ్బిలి అందించిన పాటలన్నీ బాగున్నాయని, సినిమా కథకు తగ్గట్టుగా ఉన్నాయని అన్నారు. తరుణ్ భాస్కర్ పోషించిన బాలరాజు రోల్ తనకు బాగా నచ్చిందని అనుపమ చెప్పారు. ఆ పాత్రను చూసినప్పుడు కొన్నిసార్లు తాను అబ్బాయిగా పుట్టి ఉంటే బాగుండేదనిపించిందని సరదాగా అన్నారు.

దర్శకుడు సెకెండ్ పార్ట్ తీస్తే తాను లేడీ బాలరాజుగా నటించడానికి సిద్ధమని చెప్పారు. తరుణ్ భాస్కర్‌ తో కలిసి పనిచేయడం, సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొనడం చాలా బాగుందని తెలిపారు. తమ ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయని చెప్పారు. నటుడు నరేష్‌ తో కలిసి గతంలో అఆ, శతమానం భవతి సినిమాలకు పనిచేశానని అనుపమ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు క్రేజీ కళ్యాణంలో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సన్నివేశంలోనూ నరేష్ తన పాత్రకు న్యాయం చేస్తారని ప్రశంసించారు.

అఖిల్ రాజ్ యాక్టిం, నేచురల్ ఎక్స్ప్రెషన్స్ తనకు నచ్చాయని చెప్పారు. కిరీటి దామరాజుతో మరోసారి కలిసి పనిచేయాలని ఉందన్నారు. సినిమాలోని నటీనటులంతా రియల్ ఫ్యామిలీ మెంబర్స్ అనిపించారని అనుపమ తెలిపారు. అందరితోనూ బాగా కలిసిపోయి నటించానని చెప్పారు. తన వల్ల కొంతమంది ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరారు. అలా క్రేజీ కళ్యాణంపై ఎంతో నమ్మకంతో ఉన్నానని, ఆ సినిమా మరో శతమానం భవతిలా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News