క్రేజీ కళ్యాణం 'బరాత్'.. క్రేజీ క్రేజీగా..
'క్రేజీ కళ్యాణం' కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ సీనియర్ నటుడు వీకే నరేశ్ తెలిపారు.
దసరా పండగ వేళ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది 'క్రేజీ కళ్యాణం'. ఆ సినిమా విడుదలకు ముందు నిర్వహించిన 'బరాత్' (ప్రీ రిలీజ్ ఈవెంట్)లో మూవీ టీమ్ అంతా ఒక ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతున్నట్లుగా ఫుల్ జోష్ తో పాల్గొంది. సినిమా విశేషాలను షేర్ చేసుకుంటూ.. తమ ఎక్స్పీరియన్సులను గుర్తు చేసుకుంది. ఆ ఈవెంట్ లో మూవీ టీమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.
'క్రేజీ కళ్యాణం' కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ సీనియర్ నటుడు వీకే నరేశ్ తెలిపారు. సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పారు. తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ జోడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రశంసించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ బాగా కుదిరాయని పేర్కొన్నారు. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు భద్రాప్ప గజూల, నిర్మాత జగన్ మోహన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు.
నటుడు కిరీటి కూడా సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. మూవీ టీమ్ అంతా ఒక కుటుంబంలా కలిసిపోయి సరదాగా గడిపామని గుర్తు చేసుకున్నారు. తన రోల్ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు థ్యాంక్స్ తెలిపారు. థియేటర్లలో ప్రేక్షకులకు పండగలాంటి ఎంటర్టైన్మెంట్ అందుతుందని చెప్పారు.
సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి ఆ సినిమా పాటల గురించి మాట్లాడారు. సాంగ్స్ అన్నీ జోష్ లో, ఎంటర్టైన్మెంట్ పంచేలా రూపొందించామని తెలిపారు. సీన్స్ కు తగినట్లుగా బ్యాక్ గ్రౌండ్ వచ్చిందని చెప్పారు. పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలుపుతూ.. ఆ సినిమా మ్యూజిక్ పరంగా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు.
లిరిక్స్ రైటర్ శ్యామ్ కాసర్ల కూడా తన అనుభవాలను పంచుకున్నారు. 'కాకా ధూమ్ ధమాకా' అనే బరాత్ పాటతో పాటు హీరో, హీరోయిన్ మధ్య వచ్చే మరో పాటను రాసినట్లు తెలిపారు. రామ్ మిర్యాల పాడిన ఆ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఫోక్ సింగర్ వెంకన్న సినిమా కథను ప్రశంసించారు. జీవితంలోని ఎమోషన్స్ ను 'క్రేజీ కళ్యాణం'లో చక్కగా చూపించారని తెలిపారు. కామెడీ, కన్నీళ్లు, తండ్రి ప్రేమ వంటి అంశాలు ఇందులో సమానంగా ఉంటాయని చెప్పారు.
సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తమ జీవితంలోని ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తాయని అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ వాల్యూస్, ఆడపిల్లల గొప్పతనాన్ని చాటే ఆ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దర్శకుడు భద్రాప్ప జీవితాన్ని దగ్గరగా గమనించి కథను రూపొందించారని కొనియాడారు. సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, లిరిక్స్ రైటర్ శ్యామ్ కాసర్లకు థ్యాంక్స్ తెలిపారు. ఆ తర్వాత 'కాకా ధూమ్ ధమాకా.. లగ్గమింట్ల పందిల్లే పడ్డాకా..' పాటను స్టేజ్ పై పాడి అందరిలో జోష్ నింపారు.