విశ్వంభర రిలీజ్ డేట్ - ఓటీటీ డీల్ సవాళ్లు!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `బింబిసార` ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర`.

Update: 2026-10-15 01:30 GMT

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `బింబిసార` ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర`. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చుట్టూ కొంతకాలంగా రకరకాల విడుదల తేదీల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి నాన్-థియేట్రికల్ -డిజిటల్ ఓటీటీ డీల్స్ రూపంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అనుకున్న టైమ్‌లైన్‌ ప్రకారం సినిమాను థియేటర్లలోకి తీసుకురాకపోతే.. ఓటీటీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు , ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కుదిరిన ప్రాథమిక ఒప్పందాల ప్రకారం నిర్దిష్ట గడువు లోపు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మేకర్స్‌పై ఉంది. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ ఈ డీల్స్ లాక్ అయినట్లు సమాచారం. ఒకవేళ ఈ డీల్ నిలబడాలన్నా? లేదా ? ఒప్పదాల పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నా `విశ్వంభర`ను సంక్రాంతి బరిలోనే దింపాలని చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది. లేనిపక్షంలో డిజిటల్ పార్ట్‌నర్స్‌తో కుదిరిన అగ్రిమెంట్లలో మార్పులు చేర్పులు జరిగే రిస్క్ ఉంటుందని వినిపిస్తోంది.

ప్రస్తుతం మెగా కాంపౌండ్‌లో మరో సవాలు కూడా నడుస్తోంది. చిరంజీవి నటిస్తున్న మరో ప్రాజెక్ట్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండటంతో ఒకే సీజన్‌లో మెగాస్టార్ నుంచి రెండు సినిమాలు వస్తే బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడుతుందనే మీమాంస నెలకొంది. ఏ సినిమాను సంక్రాంతి రేసులో నిలపాలి? వేటిని వేరే డేట్లకు షిఫ్ట్ చేయాలనే దానిపై మెగా క్యాంప్‌లో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు ఓటీటీ సంస్థల ఒత్తిడి, మరోవైపు అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉండటంతో సరైన నిర్ణయం తీసుకోవడం మేకర్స్‌కు కత్తిమీద సాములా మారింది.

సోషియో-ఫాంటసీ జోనర్ చిత్రానికి సంబంధించి వీఎఫ్‌ఎక్స్ , గ్రాఫిక్స్ పనులు అత్యంత కీలకం. గతంలో వాయిదాలు ప‌డినా? ఇప్పుడు మాత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులను తుది దశకు తీసుకువచ్చారు. ఓటీటీ డీల్‌ను సురక్షితంగా హ్యాండిల్ చేయాలంటే సంక్రాంతి సీజన్‌ కంటే చక్కటి వేదిక మరొకటి ఉండదని భావిస్తున్నారు. పండగ సీజన్ అయితేనే భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి.. డిజిటల్ రైట్స్ ద్వారా పెట్టుబడిని బ్యాలెన్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నిర్మాతలు లెక్కలేస్తున్నారు.

కానీ సంక్రాంతి రేసులో ఇప్పటికే మ‌రికొంత మంది స్టార్ హీరోల సినిమాలు రేసులో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇలాంటి పోటీ న‌డుమ `విశ్వంభర` సోలో రిలీజ్ దక్కించుకోవడం లేదా థియేటర్ల సర్దుబాటు చేయడం కూడా పెద్ద సవాలే. అయినా? ఓటీటీ నిబంధనలను గౌరవిస్తూ అనుకున్న డెడ్‌లైన్‌కు కట్టుబడి ఉండాలంటే సంక్రాంతి పండుగనే నమ్ముకోవడం ఉత్తమమనే ప్రాధామిక‌ నిర్ణయానికి వచ్చినట్లు స‌మాచారం.

Tags:    

Similar News