అమీర్ మేనల్లుడి డెసిషన్.. కాస్త రిస్కేనా..
బాలీవుడ్ లో ఒకప్పుడు లవ్ స్టోరీలతో యూత్ ను అట్రాక్ట్ చేసిన హీరో ఇమ్రాన్ ఖాన్. అమీర్ ఖాన్ మేనల్లుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
బాలీవుడ్ లో ఒకప్పుడు లవ్ స్టోరీలతో యూత్ ను అట్రాక్ట్ చేసిన హీరో ఇమ్రాన్ ఖాన్. అమీర్ ఖాన్ మేనల్లుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ ప్రొటెస్ట్ లో కనిపించడం ఆయనకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందా.. సినిమాల్లోకి తిరిగి వస్తున్న వేళ ఈ నిర్ణయం రిస్కేనా అనే చర్చ మొదలైంది.
రీసెంట్ గా కాక్రోచ్ జనతా పార్టీ ముంబైలో నిర్వహించిన ప్రొటెస్ట్ లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ విషయం బయటకు రావడంతో డిబేట్ మొదలైంది. ఇమ్రాన్ ఆ నిరసనలో పాల్గొనడం వెనుక కారణాలు, ఇప్పుడు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ సిటిజన్ షిప్ ఎలిమెంట్ ను చాలా మంది ప్రస్తావిస్తున్నారు.
ఆయన అమెరికా పౌరుడని, భారత్లో ఓసీఐ కార్డు ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్లో రాజకీయ నిరసనలో పాల్గొనడంపై ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో కొందరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఆయనను దేశం నుంచి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆరోపణలు రావడం వేరు.. వాటిపై అధికారులు తీసుకునే నిర్ణయం వేరు. ఆ విషయంలో చట్టం ప్రకారం ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.
ఇక ఇమ్రాన్ కెరీర్ను చూస్తే ఒకప్పుడు ఆయనకు మంచి గుర్తింపు ఉంది. జానే తూ.. యా జానే నా, ఐ హేట్ లవ్ స్టోరీస్, ఢిల్లీ బెల్లీ, మేరే బ్రదర్ కీ దుల్హన్' వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయన సినిమాలకు దూరమయ్యారు. దాదాపు పదేళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పొలిటికల్ ఇష్యూతో ట్రెండింగ్ లోకి వచ్చారు.
అయితే సినిమాల్లోకి తిరిగి రావాలనుకునే నటుడికి కొత్త సినిమాలు, ప్రేక్షకుల్లో హైప్, మంచి ప్రమోషన్స్ అవసరం. కానీ ఇప్పుడు ఇమ్రాన్ విషయంలో చర్చ సినిమాల కంటే ప్రొటెస్ట్, అమెరికా సిటిజన్ షిప్ చుట్టూనే తిరుగుతోంది. ఇది ఆయన కొత్త సినిమాలపై ఎఫెక్ట్ చూపుతుందా అనేది చూడాలి. ఆ వ్యవహారం వల్ల ఇమ్రా న్కు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఆయనపై చర్యలు తీసుకుంటే సినిమా పనులకు ఇబ్బంది కలగవచ్చు. ఆ వివాదం మరింత పెరిగితే కొందరు నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి వెనుకాడవచ్చు.
మరోవైపు ఇమ్రాన్ డెసిషన్ ను కొందరు సమర్థిస్తున్నారు. సమస్యలపై సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను చెప్పడంలో తప్పేముందని వారు అంటున్నారు. అంటే ఆ డెసిషన్ వల్ల ఆయనకు పూర్తిగా మైనస్ అవుతుందని ఇప్పుడే చెప్పలేం. అదే సమయంలో ఇది ఆయనకు ప్లస్ అవుతుందని కూడా అనుకోలేం. మరేం జరుగుతుందో.. కొందరి డిమాండ్లపై అధికారులు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూడాలి.