పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు?

పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు అతని అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. కెరియర్ స్టార్టింగ్ లో తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు.

Update: 2026-10-14 23:30 GMT

పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు అతని అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. కెరియర్ స్టార్టింగ్ లో తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి లాంటి సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ తార స్థాయికి వెళ్ళిపోయింది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ ను సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్ కావడం విశేషం... తను సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ కి దగ్గర్లో ఉన్నప్పుడే 'జనసేన' పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అవకాశం దొరికిన ప్రతీసారి సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోయిన కూడా అతని అభిమానులు మాత్రం ఈ సినిమాతో కొంతవరకు సాటిస్ఫై అయ్యారు. తన తదుపరి సినిమా విషయంలో అప్డేట్ ఎప్పుడు వస్తుందని కొద్ది నెలలుగా అభిమానులు వేచి చూస్తున్నారు...

ఆ దర్శకుడి కథ ఫైనల్ కాలేదా

పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి అరడజన్ మంది దర్శకులు క్యూలో ఉన్నారు. తను మాత్రం సురేందర్ రెడ్డి తో చర్చలు జరిపాడు. చిరంజీవితో సైరా సినిమా చేస్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ అతనితో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపడా కథతో సంప్రదించాడు. మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య ఇంకా కథ చర్చలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జనవరిలో పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రామ్ తాళ్లూరి ప్రొడ్యూసర్ గా ఈ మూవీ తెరకెక్కుతుందంటూ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ కథలో మార్పులు చేర్పులు ఉండడం వల్ల స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక ఓపెనింగ్ చేస్తారట...

నెలకి ఎన్నిరోజుల డేట్స్ ఇస్తాడు...

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో చాలా చురుగ్గా ముందుకు సాగుతున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. అందుకని సమయం దొరికినప్పుడు మాత్రమే సినిమాలను చేస్తున్నాడు. ఆయన బిజీగా ఉండటం వల్ల తనకి సినిమా చేసే టైం లేకుండా పోతుంది. దీనివల్లే సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వడానికి కొంత టైం తీసుకుంటున్నారు. ఒకసారి కాంబినేషన్ సెట్ అయి సినిమా సెట్స్ మీద కి వచ్చిందంటే మూవీ అప్డేట్ గురించి అభిమానులు అడుగుతూ ఉంటారు. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సినిమా కి కమిట్ అయి నెలకి 10 రోజుల చొప్పున డేట్స్ ఇస్తాడట. సినిమాను వీలైనంత తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబోలో రాబోయే మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుందనేది తెలియాల్సి ఉంది...

Tags:    

Similar News