'రాకా ' మూవీ సక్సెస్ కోసం చూస్తున్న స్టార్ హీరోలు...

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో 'రాకా' సినిమా చేస్తున్నాడు.

Update: 2026-10-14 19:30 GMT

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో 'రాకా' సినిమా చేస్తున్నాడు. వైవిద్య భరితమైన కథాంశంతో హై ఎండ్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కాబట్టి విజువల్ వండర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. నటన విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. 'పుష్ప' సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్న తర్వాత రాకా స్టోరీ డిఫరెంట్ గా ఉందని ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాతో అట్లీ ప్రపంచ స్థాయి దర్శకుడిగా మారిపోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మూవీ పూర్తిగా గ్రాఫికల్ విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. కాబట్టి అట్లీ ఈ సినిమాని అత్యంత కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ కమర్షియల్ టెంప్లేట్ లోనే ఉండేవి కానీ మొదటిసారి ఆయన భారీ విజువల్స్ ను వాడుతూ ఆ గ్రాండియర్ తో మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు.

రాకా సక్సెస్ కోసం స్టార్ హీరోలు...

అట్లీ గతంలో చేసిన సినిమాలకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. షారుక్ ఖాన్ తో చేసిన 'జవాన్' సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా నిలవడమే కాకుండా కమర్షియల్ గా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పుడు చేస్తున్న రాకా సినిమా సూపర్ హిట్ అయితే స్టార్ హీరోలు అతనితో సినిమాలు చేయడానికి క్యూ కడతారు. అట్లీ సినిమాల్లో కమర్షియాలిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రాపర్ ఎమోషన్ ని బిల్డ్ చేసి కన్వే చేయడంలో ఆయన సక్సెస్ అవుతున్నాడు. రాకా గ్రాఫిక్స్ ప్రాధాన్యమున్న మూవీ కాబట్టి ఈ సినిమాలో ఆయన మార్క్ ని ఏ రకంగా చూపించబోతున్నారు ఎమోషనల్ సన్నివేశాలను ఎలా రాసుకున్నారనేది కీలకంగా మారనుంది. ఈ సినిమా సక్సెస్ అయితే స్టార్ హీరోలకు కలిగే ప్రయోజనం ఏమిటంటే మిగతా హీరోలు కూడా వాళ్ళ సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసుకోవడానికి భారీ రేంజ్ లో సినిమాలను చేయడానికి ఆస్కారం దక్కుతోంది. ఇంకా ఎన్నో హై బడ్జెట్ సినిమాలను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది...

అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్

ప్రస్తుతానికి అట్లీ ఈ ప్రాజెక్ట్ మీదనే తన పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ మూవీ అత్యంత ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతుంది. కాబట్టి ఇది పూర్తయ్యాకే ఇంకో మూవీ గురించి ఆలోచిస్తాడట. అప్పటివరకు ఇంకో సినిమా మీదకి తన ఫోకస్ వెళ్ళనివ్వకుండా పూర్తిగా ఈ సినిమా కోసమే వర్క్ చేస్తున్నాడట. ఈ మూవీ విషయంలో అట్లీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇండియన్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని భావిస్తున్నాడట...

Tags:    

Similar News