ఆ లిస్టులో ఇండియాలోని మొదటి మూవీగా వారణాసి
ఒక సినిమాకు హైప్ ఎలా క్రియేట్ చేయాలనేది రాజమౌళికి తెలిసినంత బాగా ఇండియాలో మరెవరికీ తెలియదనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.;
ఒక సినిమాకు హైప్ ఎలా క్రియేట్ చేయాలనేది రాజమౌళికి తెలిసినంత బాగా ఇండియాలో మరెవరికీ తెలియదనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. బాహుబలి ఫ్రాంచైజ్ సినిమాలతో పాటూ ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా స్థాయితో పాటూ, సినిమా ప్రమోషన్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన రాజమౌళి తన సినిమా కోసం ప్రతీదీ చాలా కొత్తగా ఆలోచిస్తారు.
ఏం చేస్తే తన సినిమా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది? కథను ఎలా చెప్తే అందరికీ అర్థమవుతుంది? ఎలాంటి సీన్స్, విజువల్స్ పడితే ఆడియన్స్ స్టన్ అవుతారు? ఎలాంటి కొత్త ప్రదేశాలను చూపిస్తే ప్రేక్షకులు ఫిదా అవుతారు ఇలా ప్రతీ విషయంలోనూ చాలా కొత్తగా ఆలోచిస్తారు జక్కన్న. అందుకే ఆయన సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు.
ఫారెస్ట్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న వారణాసి
రాజమౌళి తన ప్రతీ సినిమా విషయంలోనూ ఇంతే ఆలోచిస్తారు. ఇక అసలు విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ తో ఎన్నో రికార్డులను సృష్టించడంతో పాటూ ఆస్కార్ టాలీవుడ్ కు ఆస్కార్ ను కూడా తీసుకొచ్చిన జక్కన్న, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంటార్కిటికాలో వారణాసి షూటింగ్
ఈ సినిమా టైటిల్ ను లాంచ్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే వారణాసి వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయింది. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి ఇప్పుడు మరో సాహసం చేస్తున్నట్టు తెలుస్తోంది. వారణాసి సినిమాను అంటార్కిటికాలో షూటింగ్ చేయనున్నట్టు సమాచారం. త్వరలోనే చిత్ర బృందం లొకేషన్లను వెతకనున్నారని, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అంటార్కిటికాలోని విస్తృతమైన వాతావరణ పరిస్థితుల్లో, మునుపెన్నడూ చూడని ప్రదేశాల్లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
అదే జరిగితే అంటార్కిటికాలో షూట్ చేయబడిన మొదటి ఇండియన్ సినిమాగా వారణాసి చరిత్రకెక్కుతుంది. ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమానీ అక్కడ షూట్ చేసింది లేదు. ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తంలోనే అంటార్కిటికాలో ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాలు నాలుగే. ఇప్పుడు వారణాసి ఐదో సినిమాగా చోటు సంపాదించుకోబోతుంది. త్వరలోనే మేకర్స్ దీనిపై ఓ అప్డేట్ ను కూడా ఇచ్చే అవకాశముంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 7, 2027న రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.