శ్రీనివాస మంగాపురం.. 'మంగ' గా బాలీవుడ్ బ్యూటీ

లేటెస్ట్ గా ఈ సినిమా నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రాషా 'మంగ' అనే పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేశారు. ట్రెడిషనల్ లుక్ లో రాషా చాలా క్యూట్ గా కనిపిస్తోంది.;

Update: 2026-01-30 07:16 GMT

​టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త టాలెంట్ కు కొదవలేదు. వారసత్వంతో వచ్చే వాళ్లే కాకుండా, ఇతర భాషల నుండి క్రేజీ నటీనటులు కూడా మన దగ్గర పాగా వేస్తున్నారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్రీనివాస మంగాపురం' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్నారు. హీరో డెబ్యూ అప్‌డేట్ తోనే ఈ ప్రాజెక్ట్ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

 

​అజయ్ భూపతి అంటేనే ఒక కల్ట్ రోమాంటిక్ యాక్షన్ స్టైల్ గుర్తుకొస్తుంది. ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు చాలా వెయిటేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనేది కొంతకాలంగా సస్పెన్స్ గా మారింది. రీసెంట్ గా ఈ విషయంలో చిత్ర బృందం ఒక క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాషా, ఇప్పుడు మన టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

​లేటెస్ట్ గా ఈ సినిమా నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రాషా 'మంగ' అనే పాత్రలో నటిస్తున్నట్లు రివీల్ చేశారు. ట్రెడిషనల్ లుక్ లో రాషా చాలా క్యూట్ గా కనిపిస్తోంది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ లోనే నటిస్తోందని అర్థమవుతోంది. ఇప్పటికే 'ఉయి అమ్మ' గర్ల్ గా నెట్టింట ఫుల్ పాపులారిటీ ఉన్న రాషాకు, ఈ తెలుగు డెబ్యూ సినిమా మరింత మైలేజీని ఇస్తుందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

​ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో దాదాపు 30 రోజుల పాటు మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. సినిమాలోని సుమారు 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం రెండో షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు సాంగ్స్ ను కూడా చిత్రీకరిస్తున్నారు. 2026 లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా తగ్గకుండా టీమ్ మొత్తం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది.

​లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ సమర్పణలో, పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ ప్రాజెక్ట్ కు అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నారట. ఒక మంచి లవ్ స్టోరీకి పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో అజయ్ భూపతి గత సినిమాలతో నిరూపించారు. అదే మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని టీమ్ ధీమాగా ఉంది. జయకృష్ణ, రాషా జంట స్క్రీన్ మీద ఫ్రెష్ గా ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్ లతోనే సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. రాషా తడాని తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Tags:    

Similar News