ప్లస్ అవుతుందనుకుంటే అదే మైనస్ అయింది
ఎలాంటి సినిమాకైనా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ అవసరం. కొన్నిసార్లు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమాకు క్రేజ్ వస్తుంది.;
ఎలాంటి సినిమాకైనా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ అవసరం. కొన్నిసార్లు ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమాకు క్రేజ్ వస్తుంది. కొన్ని కాంబినేషన్లు కుదిరితే అనుకోకుండానే సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుంది. మరికొన్ని సార్లు పోస్టర్లతోనో, టీజర్‌తోనో, ట్రైలర్‌తోనో లేక పాటలతోనో విపరీతమైన క్రేజ్ వచ్చి, సినిమాకు మంచి బజ్ వస్తుంది.
పబ్లిసిటీ విషయంలో జాగ్రత్తలు అవసరమే!
అలాంటి బజ్ తో సినిమాలు రిలీజైతే ఓపెనింగ్స్ కూడా బాగా వస్తాయి. కానీ ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఆడియన్స్ దాన్ని డిజాస్టర్ చేసేస్తారు. అందుకే పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు పడాలంటున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఆయన దర్శకత్వంలో 2010లో వచ్చిన వరుడు సినిమా రిలీజ్ కు ముందు ఎంత హైప్, క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
వరుడు సినిమాకు విపరీతమైన క్రేజ్
దానికి కారణం సినిమాలోని హీరోయిన్ ను చాలా జాగ్రత్తగా దాచడం. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది రిలీజ్ కు ముందు వరకు కూడా రివీల్ చేయలేదు. సినిమాలో కూడా ఇంటర్వెల్ ముందు మాత్రమే హీరోయిన్ ఫేస్ రివీల్ అవుతుంది. దీంతో వరుడు సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. సినిమాలో హీరో ఎలాగైతే పెళ్లి పీటల మీదే హీరోయిన్ ను చూస్తాడో, అలానే ఆడియన్స్ కు కూడా థియేటర్లలోనే హీరోయిన్ ఫేస్ ను రివీల్ చేద్దామనుకున్నానని, ఆ ఒక్క ఐడియా వల్ల సినిమాకు ఊహించని క్రేజ్ వచ్చిందని గుణశేఖర్ చెప్పారు.
మినిస్టర్ల నుంచి కూడా కాల్స్!
ఆ హైప్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిందని, ఆ టైమ్ లో కొందరు మినిస్టర్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ తనకు కాల్స్ చేసి మరీ ఎవరా హీరోయిన్ అని అడిగారని, మరికొందరు ఆ హీరోయిన్ కమల్ హాసన్ కూతురే కదా అని అడిగేవారని, అంతటి ఓవర్ హైప్ క్రియేట్ అయిన తర్వాత తాను చూపించిన హీరోయిన్ ఆడియన్స్ అంచనాలకు సరితూగలేదని, వరుడు లో యాక్ట్ చేసిన భాను శ్రీ మెహతా మామూలుగు బావుంటుంది కానీ, ఓవర్ హైప్ వల్ల ఆమె జనాలకు ఆనలేదని గుణశేఖర్ చెప్పారు.
ఫిబ్రవరి 6న యుఫోరియా రిలీజ్
వరుడు మూవీ విషయంలో తాను ప్లస్ అవుతుందనుకున్న పాయింటే మైనస్ అయిందని, పైగా ముందు అనుకున్నట్టు కేవలం ఐదు రోజుల పెళ్లితో ఆగిపోతే సినిమా ఫలితం వేరేలా ఉండేదని, కానీ తర్వాత సెకండాఫ్ యాక్షన్ కూడా చేర్చడం వల్ల సినిమా రిజల్ట్ మారిపోయిందని గుణశేఖర్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఓవర్ హైప్ కూడా సినిమాను దెబ్బతీస్తుందని అర్థమవుతుంది. ఇక గుణశేఖర్ విషయానికొస్తే ఆయన దర్శకత్వం వహించిన కొత్త సినిమా యుఫోరియా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.