• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లరి నరేష్.. ఇది...

అల్లరి నరేష్.. ఇది ఊహించని కాంబో!

| నేడు అల్లరి నరేష్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

By - Tupaki Desk
Update: 2024-07-27 09:22 GMT

అల్లరి నరేష్ కేవలం కామెడీ సినిమాలు మాత్రమే చేస్తాడు అనే ట్యాగ్ నుంచి నాంది లాంటి ప్రయోగాలు కూడా చేయగలడు అని స్ట్రాంగ్ గా నిరూపించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న అల్లరి నరేష్, ప్రతి సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తారని అర్ధమవుతుంది. ఇక రాబోయే సినిమాలలో కూడా డిఫరెంట్ కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో అతని మంచి ఛాన్స్ దక్కింది.


నేడు అల్లరి నరేష్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించగా, ఇప్పుడు జూలై 27న పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాకి "ఫ్యామిలీ డ్రామా" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న మెహర్ తేజ్ దర్శకత్వం వహించనున్నారు. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇవ్వబోతోందని మేకర్స్ తెలియజేశారు.


నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాలో అల్లరి నరేష్ సరసన రుహాని శర్మ నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందించనున్నారు, జిజు సన్నీ సినిమాటోగ్రాఫర్ గా, రామకృష్ణ అర్రం ఎడిటర్ గా, విశాల్ అబానీ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ, "నూతన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లలో విభిన్న అనుభూతిని అందిస్తుందని, అల్లరి నరేష్ మళ్లీ ఒక కొత్త పాత్రలో మెరిసిపోతారని ఆశిస్తున్నాం" అని అన్నారు. అల్లరి నరేష్ తన కెరీర్ లో ఎంతోమంది దర్శకులతో కలిసి విభిన్న పాత్రలను పోషించారు.

ఇక ఈ సినిమాలో కూడా ఆయన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అనుకుంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే సంకల్పంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది. మరి ఈ న్యూ కాంబినేషన్ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Maheshbabu 
  • Pawankalyan 
  • TilluSquare 
  • SitharaEntertainments 
  • SitharaBanner 
  • MeherTej 
  • Ugram 
  • AllariNaresh 
  • AN63 
  • Nagavamsi 

Similar News

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

రష్మిక భుజంపై చేయి వేసిన విజయ్ దేవరకొండ.. అందుకేనా ఇదంతా?

2026-11-07 05:11 GMT

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ న‌టి జ‌ర్నీ ప‌ర్ఫెక్ట్ కేస్ స్ట‌డీ

2026-11-07 04:04 GMT

ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

2026-11-07 04:03 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

సిద్ శ్రీరామ్.. ఒకప్పటి డిమాండ్ ఇప్పుడు ఏదీ!

2026-11-07 04:01 GMT

కాజల్‌ ఉండగా.. సాయిపల్లవి కోసం ఆరాటమా?

2026-11-07 04:00 GMT

సీనియర్ ఎన్టీఆర్ వల్లే జీవితంలో ఆ కీలకమైన పని చేసిన మురళి మోహన్..!

2026-11-07 03:51 GMT

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్‌లో ఒక శాపమా..?

2026-11-07 02:43 GMT

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

2026-11-07 02:42 GMT

చిరు, నాగ్ స్టెప్పులు.. నాగచైతన్య లైఫ్ పై సీరియస్.. MegaVerse లో ఏం జరిగిందంటే..!

2026-11-07 02:41 GMT

Copyright @2026

Powered by Blink CMS