• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్-హాను మూవీలో మరో...

ప్రభాస్-హాను మూవీలో మరో మలయాళ భామ?

| 1940ల నాటి యుద్ధ నేపథ్యంలో సాగే ఈ భారీ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలువురు కీలక నటీనటుల ఎంపిక జరిగిపోయింది.

By - Tupaki Desk
Update: 2025-01-29 23:30 GMT

ప్రభాస్ హీరోగా హాను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఫౌజీపై రోజుకో కొత్త అప్‌డేట్ బయటకు వస్తోంది. 1940ల నాటి యుద్ధ నేపథ్యంలో సాగే ఈ భారీ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలువురు కీలక నటీనటుల ఎంపిక జరిగిపోయింది. అయితే తాజాగా, మరో భామ ఈ సినిమాలో చేరబోతుందనే సమాచారం వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో నాయికగా కొత్త భామ ఇమాన్విని ఎంపిక చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం, మరో మలయాళ నటి కూడా ఈ ప్రాజెక్ట్‌లో రెండో హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఆమె పేరును మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. కొంతకాలం సీక్రెట్ గానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ, పరిశ్రమలో ఈ టాక్ బలంగా వినిపిస్తోంది.

హాను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ భారీ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. ప్రభాస్ ఇందులో బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే యుద్ధ నేపథ్యంలో కొన్ని ప్రధానమైన భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా మలయాళ నటి పేరు తెరపైకి రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇక మలయాళ నటి ఎవరనే విషయంలో కూడా ఫిల్మ్ సర్కిల్స్‌లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో తెలుగు చిత్రాల్లో నటించిన అమ్మాయే అనే టాక్ వినిపించినా, ఈ రోల్‌కు కొత్త పేరు ఫైనల్ చేశారని అంటున్నారు. మలయాళ చిత్రసీమ నుంచి వచ్చిన ఈ భామకు టాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా అవుతుందా? లేదా ఇదివరకే ఏదైనా తెలుగు సినిమాలో నటించిందా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రభాస్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో పాతకాలపు బ్రిటిష్ జైల్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత, మరికొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేయనున్నారని సమాచారం. మేకర్స్ త్వరలోనే ఈ రెండో హీరోయిన్ ఎంపికపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలోని కథ, ప్రభాస్ గెటప్, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ రాబోయే రోజుల్లో హైప్ క్రియేట్ చేయడం ఖాయం. ముఖ్యంగా మరో మలయాళ నటి జాయిన్ అవ్వడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి ఆ నటి ఎవరో తెలియాలంటే మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    
  • Tollywood 
  • Mollywood 
  • Filmindustry 
  • Fauji 
  • Prabhas 
  • Hanuraghavapudi 
  • Malayaalamactress 
  • Joinsteam 
  • Heroines 
  • Malayalamindustry 
  • Secondheroine 

Similar News

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

Copyright @2026

Powered by Blink CMS