అనిరుధ్‌పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం...!
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచంద్రన్ పై సూపర్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.;
కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచంద్రన్ పై సూపర్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ విషయంలో ఆయన చిన్న చూపు చూపిస్తున్నారు అనే విమర్శలను వారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ విషయంలో ఆయన చాలా చులకన భావంతో ఉన్నారు అనిపిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న లియో సినిమా ఓఎస్‌టీ విడుదల చేయడం లేదని, నిన్న కాక మొన్న వచ్చిన కూలీ సినిమా యొక్క ఓఎస్‌టీ విడుదలకు అనిరుధ్ డేట్‌ను ఫిక్స్ చేశాడు. దీన్ని బట్టి ఆయన విజయ్ సినిమాకు ఎంత ఎఫర్ట్ పెట్టాడు, రజనీకాంత్ సినిమాకు ఎంత ఎఫర్ట్ పెట్టాడో అర్థం అవుతోంది అంటూ విజయ్ అభిమానులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
లియో ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు
ఈమధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల యొక్క ఓఎస్‌టీలను విడుదల చేయడం పరిపాటిగా వస్తుంది. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లను విడుదల చేయడం ద్వారా అభిమానులు ఆ సౌండ్ ట్రాక్‌తో సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో వీడియోలను క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేయడం ద్వారా సినిమా గురించి మళ్లీ చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి స్టార్ హీరో సినిమా విడుదల అయిన సమయంలో అభిమానులు ఓఎస్‌టీ ని విడుదల చేయాలని మ్యూజిక్ డైరెక్టర్‌లను కోరడం జరుగుతూ ఉంటుంది. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ మొత్తం మ్యూజిక్‌ను రిలీజ్ చేస్తే కొందరు మాత్రం కొన్ని ముఖ్యమైన సౌండ్ ట్రాక్‌లను విడుదల చేయడం మనం చూస్తూ ఉంటాం.
రజనీకాంత్ కూలీ ఓఎస్‌టీ రిలీజ్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ స్టార్ విజయ్ యొక్క 'లియో' సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే విజయ్ అభిమానులు అప్పటి నుంచి ఇప్పటి వరకు లియో యొక్క ఓఎస్‌టీ ని విడుదల చేయాలని కోరుకుంటూ వస్తున్నారు. కానీ అనిరుధ్ రవిచంద్రన్ మాత్రం వరుస సినిమాలు చేస్తున్న కారణంగా లియో యొక్క ఓఎస్‌టీ పై శ్రద్ద పెట్టలేక పోతున్నాడు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు. కానీ ఇటీవల విడుదల అయిన రజనీకాంత్ కూలీ సినిమా యొక్క ఓఎస్‌టీ ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. అంటే రేపు కూలీ సినిమా యొక్క ఓఎస్‌టీ విడుదల కాబోతుంది. ఓటీటీ స్ట్రీమింగ్ కి ముందే ఓఎస్‌టీని విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని అనిరుధ్ ఆకర్షించబోతున్నారు.
అనిరుధ్ పై విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం
థియేటర్‌లోకి వచ్చి నెల కూడా కాకుండానే అప్పుడో ఓఎస్‌టీని విడుదల చేయడం అనేది ఖచ్చితంగా రజనీకాంత్ ఫ్యాన్స్‌కి చాలా పెద్ద గుడ్ న్యూస్. కానీ ఎందుకు లియో సినిమా విషయంలో అలా చేయడం లేదు అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా లియో ఒరిజినల్ సౌండ్ ట్రాక్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వారు ఎంతగా విజ్ఞప్తి చేసినా అనిరుధ్ పట్టించుకోవడం లేదు. కూలీ సినిమా యొక్క ఓఎస్‌టీ విడుదల చేయబోతున్న నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ మరోసారి సీరియస్‌గా ఈ విషయం గురించి చర్చిస్తున్నారు. మరి ఇప్పుడు అయినా అనిరుధ్ తన లియో సినిమా యొక్క ఓఎస్‌టీ విడుదల చేసేందుకు రెడీ అవుతాడా అనేది చూడాలి. ఇప్పటికీ లియో ఓఎస్‌టీ రాకుంటే ఖచ్చితంగా విజయ్ ఫ్యాన్స్ నుంచి మరింత తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు.