• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ వస్తున్నా.. యానిమల్...

సలార్ వస్తున్నా.. యానిమల్ స్పీడ్ తగ్గట్లే..

| 2023 చివరి నెలలో సినిమాలు అదరగొడుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్​ ఇలా వరుస పండుగల నేపథ్యంలో రిలీజ్​కు క్రేజీ సినిమాలు రెడీ అయ్యాయి

By - Tupaki Desk
Update: 2023-12-17 07:30 GMT

2023 చివరి నెలలో సినిమాలు అదరగొడుతున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్​ ఇలా వరుస పండుగల నేపథ్యంలో రిలీజ్​కు క్రేజీ సినిమాలు రెడీ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో వరుసగా థియేటర్లలోకి రానున్నాయి. ఇప్పటికే రిలీజైన సినిమాలు సూపర్ హిట్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేమస్ ఆన్​లైన్​ టికెట్ బుకింగ్స్ ప్లాట్​ఫామ్​ బుక్​ మై షో.. ఇంట్రెస్టింగ్ స్టాట్స్​ను విడుదల చేసింది. గత 24 గంటల్లో ఏఏ సినిమాకు ఎన్ని టికెట్లు ఆన్​లైన్​లో బుక్​ అయ్యాయి అనే వివరాల్లోకి వెళితే..

అందులో ఇటీవలే బాక్సాఫీస్ వద్ద బ్లాక్​ బస్టర్ హిట్ సాధించిన యానిమల్ మూవీ​ ఫస్ట్ ప్లాస్​లో ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన విడుదలైంది. అయితే మూవీ రిలీజ్​ అయ్యి 16రోజులు అవుతున్నా క్రేజ్​ ఏ మాత్రం తగ్గలేదు. నిన్న ఒక్క రోజే కేవలం బుక్​ మై షోలోనే ఈ సినిమా కోసం 21వేలకుపైగా టికెట్లను బుక్​ చేసుకున్నారు ఆడియెన్స్.

బాలీవుడ్‌లో వరుసగా దేశభక్తి సినిమాలు చేస్తున్న హీరో విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ సామ్ బహదూర్. డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యానిమల్​తో పోటీ పడుతూ కూడా మంచి వసూళ్లే సాధించింది. గత 24 గంటల్లో 10వేలకు పైగా ఈ సినిమా టికెట్లను సినీప్రియుల బుక్​మై షోలో కొనుగోలు చేశారు. మూడో స్థానంలో నేచురల్​ స్టార్ నాని ఇటీవలే నటించిన హాయ్ నాని చిత్రం నిలిచింది. ఈ సినిమా రిలీజైన పదో రోజు.. 91వేల టికెట్లను బుక్​ చేసుకున్నారు ఆడియెన్స్. కమర్షియల్ హిట్​ అయిన సినిమాతో దర్శకుడు శౌర్యువ్ మంచి మార్కులు కొట్టేశారు.

తొలి మూడు స్థానాల్లో ఇప్పటికే రిలీజైన సినిమాలు ఉండగా.. తర్వాత రెండు ప్లేస్​ల్లో రిలీజ్​ కాబోయే సినిమాలు దుమ్మురేపాయి. నాలుగు, ఐదు స్థానాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్​, బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​ డంకీ నిలిచాయి. దేశంలో ఇటీవలే ఈ చిత్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బాక్సాఫీస్​ వద్ద ఒక్కరోజు తేడాలో రిలీజ్​ కానున్న ఈ రెండు సినిమాలు ప్రీ బుకింగ్స్​ జోరుగా సాగుతున్నాయి.

గత 24 గంటల్లో 38వేల సలార్ పార్ట్​-1 టికెట్స్ సేల్​ అవ్వగా.. 28వేలకు పైగా డంకీ సినిమా టికెట్లు అమ్ముడయ్యాయి. డిసెంబర్​ 21వ తేదీన డంకీ, 22వ తేదీన సలార్​ పాన్​ ఇండియా స్థాయిలో రిలీజ్​ కానున్నాయి.

చివరగా.. డిసెంబర్ 15వ విడుదలైన హారర్​ చిత్రం పిండం మిక్స్​డ్ టాక్​తో దూసుకోపోతోంది. తొలిరోజు డీసెంట్​ ఓపెనింగ్స్​ దక్కించుకున్న ఈ మూవీ.. రెండో రోజు ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు సంబంధించి గత 24 గంటల్లో ఏడు వేల టికెట్లు బుక్కయ్యాయి. అయితే మరికొద్ది రోజుల్లో వరుస పండుగలు ఉన్న నేపథ్యంలో బుక్​ మై షోలో బుకింగ్స్​ దుమ్మురేపనున్నాయి.

Tags:    
  • Animalmovie 
  • Ranbirkapoor 
  • Sandeepvanga 
  • Rashmika 
  • Salaar 
  • Animal 
  • Prabhas 
  • Prashanthneel 
  • Filmindustry 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS