అనిల్ రావిపూడి 'రామాయణం'... అసలు విషయాలు

బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌ హిట్స్‌తో దూసుకు పోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్‌, అనిల్ రావిపూడిలతో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.;

Update: 2026-04-09 08:30 GMT

బ్యాక్‌ టు బ్యాక్‌ సూపర్‌ హిట్స్‌తో దూసుకు పోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్‌, కళ్యాణ్ రామ్ తో సినిమాకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. గత కొన్ని వారాలుగా ఈ భారీ మల్టీ స్టారర్‌ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ పనుల్లో అనిల్‌ బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్‌ సినిమాల తర్వాత అనిల్ రావిపూడి మళ్లీ సంక్రాంతికి రావాల్సిందే అని ఆయనను అభిమానించే వారు, ఆయనతో సినిమాను చేస్తున్న వారు ఒత్తిడి చేస్తున్నారని టాక్‌. దాంతో ఆయన 2027 సంక్రాంతికి వచ్చే విధంగా పనులు స్పీడ్‌గా చక్కబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. అనిల్‌ రావిపూడి కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 సినిమాలను ఫుల్‌ లెంగ్త్‌ మల్టీస్టారర్‌ సినిమాలుగా రూపొందించిన అనిల్ రావిపూడి, మన శంకరవర ప్రసాద్‌ సినిమాలో వెంకటేష్ ను గెస్ట్‌గా చూపించడం ద్వారా సక్సెస్‌ అయ్యారు.

అనిల్ రావిపూడి రామాయణం...

వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌ కాంబో మూవీపై ప్రారంభంకు ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు తన దృష్టిని పూర్తిగా ఈ సినిమాపై ఉంచుతాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఈ సినిమాపైనే కాకుండా తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ యానిమేషన్‌ రామాయణం గురించిన చర్చల్లోనూ పాల్గొంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. అనిల్‌ రావిపూడికి యానిమేషన్‌ రామాయణంను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆసక్తి చాలా కాలంగా ఉంది. అందుకు తగ్గట్లుగానే చాలా కాలంగా వివిధ డిపార్ట్‌మెంట్స్‌తో చర్చలు జరుపుతున్నాడట. రామాయణం మొత్తం కాకుండా, అందులో ఒక ప్రధాన ఘట్టం, ఇప్పటి వరకు ఏ ఒక్కరూ టచ్ చేయని ఘట్టంను అనిల్‌ రావిపూడి యానిమేషన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

సంగీత దర్శకుడు గౌర హరి...

ఒకవైపు మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ చేస్తూనే మరో వైపు యానిమేటెడ్‌ రామాయణం సినిమా కోసం సంగీత దర్శకుడిని తీసుకోవడం జరిగిందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో సంగీత దర్శకుడు గౌర హరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిరాయ్‌, హనుమాన్‌ సినిమాలకు ఈయన అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే తన యానిమేటెడ్‌ రామాయణం సినిమా కోసం గౌర హరిని దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన అనిల్ రావిపూడి రామాయణం ప్రాజెక్ట్‌ కోసం వర్క్‌ మొదలు పెట్టారనే వార్తలు వస్తున్నాయి. కానీ వీటికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అనిల్ రావిపూడి తీరు చూస్తూ ఉంటే పూర్తిగా వెంకటేష్‌, కళ్యాణ్ రామ్‌ మూవీ వర్క్‌ పై ఉన్నట్లుగా తెలుస్తోంది. అయినా కూడా రామాయణం పుకార్లు ఆగడం లేదు. ఒక వైపు బాలీవుడ్‌లో రణబీర్‌ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా రామాయణ్‌ రూపొందుతున్న విషయం తెల్సిందే.

వెంకటేష్‌, కళ్యాణ్ రామ్‌ మల్టీస్టారర్‌ మూవీ...

ప్రస్తుతం రూపొందుతున్న రామాయణ్‌ తో పాటు గతంలోనూ చాలా రామాయణం కాన్సెప్ట్‌తో సినిమాలు వచ్చాయి. అయినా కూడా అనిల్ రావిపూడి కొత్తగా రామాయణం ను చూపించాలి అనుకోవడం చర్చనీయాంశం అవుతుంది. రామాయణం ను ఎన్ని సార్లు చూసినా, ఎంత మంది చూపించిన మళ్లీ చూసే సమయంలో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే అనిల్ రావిపూడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా యానిమేటెడ్‌ రామాయణం ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. కానీ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌ సినిమాకు సమాంతరంగా ఆ యానిమేటెడ్‌ మూవీ వర్క్ జరగడం లేదు అనేది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం మల్టీస్టారర్‌ పైనే ఉంది. ఆ తర్వాత మాత్రమే ఆయన యానిమేట్‌ రామాయణం గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. మరి అనిల్ రావిపూడి మాట ఏంటి అనేది చూడాలి.

Tags:    

Similar News