సోషల్ మీడియాలో అవన్నీ కామన్.. అదొక్కటే నమ్ముతా!
స్క్రిప్ట్, డైలాగ్ రైటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు.;
స్క్రిప్ట్, డైలాగ్ రైటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనిల్, ఆ తర్వాత ప్రతీ సినిమాతో ఒకదాన్ని మించి మరో సక్సెస్ ను అందుకున్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ ను నమోదు చేసుకున్న అనిల్ రావిపూడి టాలీవుడ్ హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్నారు.
నెగిటివిటీపై క్లారిటీ ఇచ్చిన అనిల్
అయితే అనిల్ ఎన్ని సినిమాలు చేసినా, ఆ సినిమాల్లో తన కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ ఓ వర్గం ఆడియన్స్ మాత్రం ఆ కామెడీని ట్రోల్ చేస్తూ క్రింజ్ అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ కామెంట్స్ అనిల్ వరకు వెళ్లినా కానీ అతను మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా అనిల్ నెగిటివిటీపై క్లారిటీ ఇచ్చారు.
కంటెంట్ ను మాత్రమే నమ్ముతా
సోషల్ మీడియాలో దేనిపై అయినా ట్రోల్స్ రావడం సహజమని, కానీ తాను వాటిని పట్టించుకోనని, తాను కేవలం కంటెంట్ ను మాత్రమే నమ్ముతానని, క్వాలిటీలో ఎప్పుడూ కాంప్రమైజ్ కానని, అవసరమైన చోటే ఖర్చు పెడతానని స్పష్టం చేశారు. సినిమా రిలీజయ్యాక తనను నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాత సంతోషంగా ఉన్నారా లేదా అనేదే తనకు ముఖ్యమని అనిల్ ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పారు.
సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు రిలీజ్
ఇక అనిల్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం అతను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసి మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం మూవీ తర్వాత అనిల్ నుంచి వస్తున్న సినిమా అవడంతో పాటూ, చిరూ- అనిల్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి కానుకగా జనవరి 12న మన శంకరవరప్రసాద్ గారు ప్రేక్షకుల ముందుకు రానుంది.