అనీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ హీరో ఎవ‌రు?

అనీల్ రావిపూడి ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్. ఎలాంటి క‌థ‌నైనా క‌మ‌ర్శియ‌లైజ్ చేయ‌గ‌ల‌డు. త‌న‌దైన మార్క్ ఫ‌న్ జోడించి ప్రేక్ష‌కుల‌కు ఇంజెక్ట్ చేయ‌డం అన్న‌ది అనీల్ స్పెషాల్టీ.;

Update: 2025-05-24 18:30 GMT

అనీల్ రావిపూడి ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్. ఎలాంటి క‌థ‌నైనా క‌మ‌ర్శియ‌లైజ్ చేయ‌గ‌ల‌డు. త‌న‌దైన మార్క్ ఫ‌న్ జోడించి ప్రేక్ష‌కుల‌కు ఇంజెక్ట్ చేయ‌డం అన్న‌ది అనీల్ స్పెషాల్టీ. నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో అనీల్ ప్ర‌త్యేక‌త ఇది. అందుకే అనీల్ అంత పెద్ద స‌క్సెస్ అయ్యాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ అనీల్ కు వైఫ‌ల్య‌మే లేదు. 'ప‌టాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్-2', 'ఎఫ్-3', 'భ‌గ‌వంత్ కేస‌రి', 'సంక్రాంతికి వ‌స్తున్నాం 'అన్ని సినిమాల్లో యాక్ష‌న్ తో పాటు కామెడీ అనే అంశాన్ని ఓ వెప‌న్ లా వాడి స‌క్సెస్ అయ్యాడు.

తెర‌పై పాత్ర‌ల‌ను మ‌లిచిని తీరుతోనే స‌క్సెస్ సాధ్య‌మైంది. ఇవ‌న్నీ దాదాపు ఒకే జాన‌ర్ లో చేసిన చిత్రాలు. మ‌రి అనీల్ ఈ జాన‌ర్ నుంచి బ‌య‌ట ప‌డేదెప్పుడు? కొత్తగా ప్ర‌య‌త్నించేది ఎప్పుడు? అంటే అనీల్ కూడా త‌న‌కి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంద‌ని తెలిపాడు. సోషియా ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్ లో ఓథ్రిల్ల‌ర్ సినిమా చేస్తానంటున్నాడు. డైరెక్ట‌ర్ కాక‌ముందే అలాంటి సినిమా తీయాల‌నుకుటున్న‌ట్లు తెలిపాడు.

అనీల్ సోషియా ఫాంట‌సీ ట‌చ్ చేసినా? అందులో త‌న మార్క్ కామెడీ మాత్రం మిస్ అవ్వ‌డు. సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్లు కూడా చాలాకాలంగా రావ‌డం లేదు. ప్ర‌స్తుతం విశిష్ట ద‌ర్శ‌కత్వంలో చిరంజీవి న‌టిస్తోన్న 'విశ్వంభ‌ర' మాత్రం సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ చిత్ర‌మే. 'జ‌గ‌దీక వీరుడు అతిలోక సుంద‌రి', 'అంజి' త‌ర్వాత చిరు చేస్తోన్న చిత్ర‌మిది. చిరంజీవి, బాల‌య్య‌, వెంక‌టేస్ కూడా సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్లు ఎక్కువ‌గానే చేసారు.

మ‌రి అనీల్ సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ లో హీరో సీనియ‌ర్ అవుతారా? త‌ర్వాత త‌రం హీరోని తీసుకుంటాడా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం చిరంజీవి తో అనీల్ ఓ కామెడీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ శుక్ర‌వారమే ప్రారంభ‌మైంది.

Tags:    

Similar News