హిట్టిస్తే మరో మూవీ ఛాన్స్.. మెగా ఆఫర్ బాగుందిగా..?

అనిల్ రావిపూడి సినిమా తీసే విధానం చూసి మెగాస్టార్ ఇంప్రెస్ అయ్యారట.;

Update: 2025-06-14 02:45 GMT

టాలీవుడ్ హిట్ మిషన్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి తను చేసిన ప్రతి సినిమాతో హిట్లు కొడుతూనే ఉన్నాడు. పటాస్ తో డైరెక్షన్ మొదలు పెట్టిన అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వరుసగా 8 సినిమాలు 8 హిట్లు కొట్టాడు. రాజమౌళి తర్వాత తీసిన ప్రతి సినిమా సక్సెస్ అందుకున్న దర్శకుడిగా రికార్డ్ సృష్టించాడు అనిల్ రావిపూడి. ఐతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తుంది.

అనిల్ రావిపూడి సినిమా తీసే విధానం చూసి మెగాస్టార్ ఇంప్రెస్ అయ్యారట. సినిమా అవుట్ పుట్ కూడా బాగా వస్తుండటంతో ఈ సినిమా అయిపోవడమే ఆలస్యం మరో సినిమా కూడా అనిల్ రావిపూడితో చేసేలా కథ సిద్ధం చేసుకోమని చిరు చెప్పారట. 2026 సంక్రాంతికి చిరు అనిల్ కాంబో సినిమా వస్తుంది. ఈ సినిమా హిట్ పడితే వెంటనే మరో మెగా మూవీ ఛాన్స్ వచ్చినట్టే అని అంటున్నారు.

భోళా శంకర్ ఫ్లాప్ తర్వాత చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈపాటికి రిలీజ్ అవ్వాల్సింది కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వల్ల లేట్ అవుతూ వస్తుంది. ఐతే అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ కి చిరు ఖుషి అవుతున్నారని తెలుస్తుంది. అనుకున్న విధంగా షెడ్యూల్ పూర్తి చేయడం సినిమా మీద పూర్తి అవగాహనతో ఉండటం ఇలాంటివన్నీ చిరంజీవికి తెగ నచ్చేశాయట.

అందుకే హిట్టు కొట్టు మరో ఛాన్స్ పట్టు అనే ఆఫర్ ఇచ్చాడట మెగాస్టార్ చిరంజీవి. అసలైతే చిరు సినిమా తర్వాత అనిల్ లిస్ట్ లో కింగ్ నాగార్జున ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణలతో సినిమాలు చేసిన అనిల్ చిరుతో ఎలాగు చేస్తున్నాడు కాబట్టి నాగార్జునతో కూడా చేస్తే సీనియర్ హీరోలు నలుగురితో చేసిన రికార్డ్ సృష్టిస్తాడు. ఐతే అనిల్ రావిపూడిలో విషయం ఉంది కాబట్టే స్టార్స్ ని మెప్పించి ఇలా వరుస సినిమాలు వరుస హిట్లు కొడుతున్నాడని చెప్పొచ్చు. సో చిరు సినిమా హిట్ పడితే మరోసారి అనిల్ చిరు మూవీ ఉంటుందని ఫిక్స్ అయిపోవచ్చు అన్నమాట.భగవంత్ కేసరి తర్వాత బాలయ్యతో కూడా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయాలని అనుకున్నాడు కానీ బాలకృష్ణ వేరే కమిట్ మెంట్స్ వల్ల కుదరలేదు.

Tags:    

Similar News