తెలుగు-తమిళ్‌ క్రేజీ కాంబోలో బాలీవుడ్‌ స్టార్‌

సర్‌, లక్కీ బాస్కర్‌ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు.;

Update: 2025-08-17 20:30 GMT

సర్‌, లక్కీ బాస్కర్‌ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు. ధనుష్‌తో సర్‌ సినిమాను, దుల్కర్‌ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్‌' సినిమాను రూపొందించిన ఈ దర్శకుడు ఇప్పుడు తమిళ్‌ స్టార్‌ హీరో సూర్యతో సినిమాను చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా విభిన్నమైన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సూర్య గత చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా కంగువా, రెట్రో సినిమాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా వసూళ్లు రాబట్టలేక పోయాయి. అందుకే ఈ సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్‌ కూడా నమ్మకంగా ఉన్నారు.

విశ్వనాథన్‌ అండ్ సన్స్ సినిమాలో సూర్య

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్యను తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు 'విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్‌గా మమితా బైజును ఎంపిక చేయడం జరిగింది. మరో హీరోయిన్‌ గురించి ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో సినిమాలో ముఖ్య పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అనిల్ కపూర్‌ను సంప్రదించానే వార్తలు వస్తున్నాయి. ఈ సీనియర్‌ నటుడు ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు భారీగా పెరగడం ఖాయం. తద్వారా ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్‌లోనూ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా మార్కెట్‌ కి అనిల్ కపూర్‌ ఎంపిక పెద్ద ప్లస్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

సూర్య-వెంకీ అట్లూరి కాంబో మూవీలో అనిల్‌ కపూర్‌

ఈ సినిమా కోసం విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఆ టైటిల్‌లో విశ్వనాథన్‌ను బట్టి చూస్తూ ఉంటే విశ్వనాథన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ పాత్రకు అనిల్‌ కపూర్‌ ను అడుగుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపిస్తున్న ఈ సీనియర్‌ హీరో తెలుగు సినిమాకు ఓకే చెప్పేనా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో సౌత్‌ దర్శకులు సత్తా చాటుతున్నారు. అంతే కాకుండా వెంకీ అట్లూరి గత చిత్రాలు సైతం మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో అనిల్‌ కపూర్‌ ఖచ్చితంగా ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వెంకీ అట్లూరి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ సినిమాపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ మూవీ

తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి సూర్య లుక్ ను అతి త్వరలో రివీల్‌ చేయబోతున్నారు. అంతే కాకుండా ఆయన పాత్రను తెలియజేసే విధంగా చిన్న గ్లిమ్స్ వీడియోను సైతం షేర్‌ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో మేకర్స్ ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను నాగవంశీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతున్నాయి. అందుకే ఈ సినిమాపై సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ ప్రతిష్ట ఆధారపడి ఉందని అంటున్నారు. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాతో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటామని దర్శకుడు వెంకీ అట్లూరి అంటున్నాడు. మరి ఆ స్థాయిలో సినిమా ఉంటుందా అనేది చూడాలి.

Tags:    

Similar News