నన్ను చంపేయ్.. కిల్లర్‌తో ప్రముఖ నటి కాంట్రాక్టు!
ఇంతకుముందు తన భర్తతో ఆస్తి, పిల్లల పంపకాల గురించిన చర్చలతో యాంజెలినా చాలా విసిగిపోయి ఉంది.;
1000 కోట్ల ఆస్తి పరురాలు.. మూడు సార్లు పెళ్లిళ్ల వైఫల్యం.. ఆరుగురు పిల్లలకు తల్లి... ఇదీ హాలీవుడ్ నటి యాంజెలినా జోలీ ట్రాక్. 50 ఏళ్ల వయసులో కూడా యాంజెలినా ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లను తట్టుకుంటోంది. ఇటీవల కేన్స్ ఉత్సవాల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన జోలీ దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ ఉత్సవాలకు ఎటెండవ్వడం చర్చనీయాంశమైంది.
ఇంతకుముందు తన భర్తతో ఆస్తి, పిల్లల పంపకాల గురించిన చర్చలతో యాంజెలినా చాలా విసిగిపోయి ఉంది. బ్రాడ్ ఫిట్ తో విడాకుల నేపథ్యంలో నిరంతరం కోర్టులకు హాజరవుతూ, మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది జోలీ. అదంతా గతం అనుకుంటే వర్తమానంలో యాంజెలినా ఎప్పటిలానే సామాజిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటోంది. సినిమాల్లో నటించేందుకు తన ప్రణాళికలు తనకు ఉన్నాయి.
యాంజెలినా గతంలోకి వెళితే.. 14 ఏళ్ల వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టిన జోలీ 1982లో తన తండ్రి దర్శకత్వం వహించిన `లుకింగ్ టు గెట్ అవుట్` అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంది. 1999లో వచ్చిన `ఇంటరప్టెడ్` సినిమాలో తన నటనకు ఆస్కార్ ను గెలుచుకుంది. ఏంజెలినా సుదీర్ఘమైన సినీకెరీర్ లో స్టార్ గా ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. యాంజెలినా అందచందాలకు ఫిదా అవ్వని అభిమాని లేడు. అంతటి అందం నెమ్మదిగా కాలంతో పాటే కరిగిపోతోంది. జీవితంలో చాలా ఒత్తిళ్లను ఎదుర్కొన్న జోలీ చివరికి కోలుకోలేని దెబ్బలు తింది. జోలీ జీవితంలో ఒక చీకటి రోజు ఉంది. అంతగా పరిణతి లేని రోజుల్లో.. ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ని నియమించుకుని తనను చంపాలని కోరిందిట. అది కూడా 20 ఏళ్ల వయసులో.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించి అందరికీ షాకిచ్చింది.