'కాలేజీలో మ్యాడ్ ఫన్'.. రామ్ కొత్త పాట పప్పీ షేమ్!

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-04 07:23 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు.


కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయన ఫ్యాన్ గా సినిమాలో రామ్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న మూవీకి వివేక్‌, మెర్విన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో మేకర్స్.. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. నువ్వుంటే చాలే అంటూ రొమాంటిక్ మెలోడీగా సాగిన పాట.. ఎంతో రిఫ్రెషింగ్ గా ఉందని చెప్పాలి. అనిరుధ్ వాయిస్, రామ్ లిరిక్స్, వివేక్‌- మెర్విన్‌ సంగీతం స్పెషల్ గా దేనికవే నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బీట్ రెడీ.. సింగిల్ రెడీ అంటూ నిన్న పోస్ట్ చేసిన మేకర్స్.. నేడు ఫ్యాన్స్, కాలేజీ, మ్యాడ్ ఫన్ అంటూ పోస్ట్ చేశారు. అయ్యెయ్యో పోయే.. అర్రెర్రే పప్పీ షేమాయే.. అని రాసుకొచ్చి.. సెప్టెంబర్ 8వ తేదీన పప్పీ షేమ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రామ్ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

అయితే పోస్టర్ లో రామ్ ఫుల్ జోష్ లో కనిపించారు. పప్పీ షేమ్ అంటూ సింబల్ చూపిస్తూ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. రామ్ లుక్ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ సెకండ్ సింగిల్ అని చెబుతున్నారు. కాలేజీలో జరిగే ఫస్ట్ నేపథ్యంలో సాంగ్ ఉంటుందని ఊహిస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ఇప్పటికే మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ కూడా అలరించింది. దీంతో సినిమా హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. నవంబర్ 28వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News