'ఆంధ్ర కింగ్ తాలూకా'.. ఆడియో సాండ్ గట్టిగానే..
కెరీర్‌లో మొదటిసారి పాట రాసినా, రామ్ తనలోని రచయితను పరిచయం చేశాడు. దానికి రాక్‌స్టార్ అనిరుధ్ గాత్రం తోడవ్వడంతో ఈ పాట పెద్ద హిట్‌గా నిలిచింది.;
రామ్ పోతినేని, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. "ఒక అభిమాని బయోపిక్" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాను నవంబర్ 27న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. సినిమా విడుదలకు ముందే, ఆడియో ఆల్బమ్ మాత్రం గట్టిగానే సౌండ్ చేస్తోంది.
ఈ సినిమాకు కొత్త సంగీత ద్వయం వివేక్ మెర్విన్ మ్యూజిక్ అందించారు. అయితే, ఈ ఆల్బమ్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కేవలం వాళ్లు మాత్రమే కారణం కాదు. ఈసారి హీరో రామ్ పోతినేని కూడా తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టి, మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో కీలకపాత్ర పోషించడం విశేషం.
ఈ ఆల్బమ్‌లో ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన "నువ్వుంటే చాలు" అనే సోల్‌ఫుల్ రొమాంటిక్ పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ అందించారు.
కెరీర్‌లో మొదటిసారి పాట రాసినా, రామ్ తనలోని రచయితను పరిచయం చేశాడు. దానికి రాక్‌స్టార్ అనిరుధ్ గాత్రం తోడవ్వడంతో ఈ పాట పెద్ద హిట్‌గా నిలిచింది. రచయితగా మారడమే కాదు, "పప్పీ షేమ్" అంటూ సాగిన పెప్పీ సాంగ్ ని రామ్ స్వయంగా పాడాడు. ఈ ఫన్ సాంగ్‌కు రామ్ ఎనర్జీ పర్ఫెక్ట్‌గా సరిపోయింది.
ఈ రెండు పాటల్లో రామ్ ప్రమేయం ఉండగా, మిగిలిన పాటలు కూడా ఆల్బమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. "చిన్ని గుండెలో" అంటూ సాగిన డ్రీమీ రొమాంటిక్ నంబర్, మైత్రీ వారి భారీ సెట్లను, నిర్మాణ విలువలను కళ్లకు కట్టింది. ఇక ఫ్యాన్స్ కోసం "FDFS" అంటూ ఒక పక్కా మాస్ సెలబ్రేషన్ సాంగ్‌ను కూడా వదిలారు. ఫస్ట్ డే ఫస్ట్ షో మానియాను చూపించే ఈ పాట థియేటర్లలో ఊపు తెప్పించడం ఖాయం.
ఇలా ఆల్బమ్‌లోని నాలుగు పాటలు నాలుగు విభిన్నమైన ఫ్లేవర్స్‌తో ఉండి, అన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు అతిపెద్ద బలంగా మారింది. నవంబర్ 18న కర్నూలులో జరగనున్న ట్రైలర్ లాంచ్‌తో ఈ హైప్ మరింత పెరగనుంది. సంగీతంలాగే సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక సూపర్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంతకుముందు వెండితెరపై ఎవరు చూపించని ఒక ఫ్యాన్ ఏమోషన్ ని దర్శకుడు మహేష్ అద్భుతంగా చూపించనున్నాడని మేకర్స్ చెబుతున్నారు.