• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాంకర్ ప్రదీప్.. సైలెంట్...

యాంకర్ ప్రదీప్.. సైలెంట్ గా ఎదో ప్లాన్ చేస్తున్నాడుగా..

| ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే బుల్లితెరపై యాంకర్ గా రాణించే ప్రయత్నం చేస్తున్న దీపికా పిళ్ళైని ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-06-09 04:13 GMT

తెలుగులో టాప్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ప్రదీప్ మాచిరాజు. రేడియో జాకీగా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ మాచిరాజు తర్వాత ఆర్టిస్టుగా సినిమాలలో ప్రయత్నాలు చేసారు. అదే సమయంలో బుల్లితెరపై యాంకర్ గా అవకాశాలు అందుకున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు బుల్లితెరపై స్టార్ మేల్ యాంకర్ గా తనదైన గుర్తింపు ని సొంతం చేస్తున్నారు.

తెలుగులో లీడింగ్ లో ఉన్న అన్ని ఎంటర్టైర్మెంట్స్ లో ప్రదీప్ యాంకర్ గా షోలు చేస్తూ సక్సెస్ అందుకున్నారు. నటుడిగా కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చాడు. ఈ ప్రయత్నంలోనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత అవకాశాలు వస్తున్న కూడా తనకు సరిపోయే కంటెంట్ కోసం వెయిట్ చేశారు. తాజాగా కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే బుల్లితెరపై యాంకర్ గా రాణించే ప్రయత్నం చేస్తున్న దీపికా పిళ్ళైని ఎంపికైనట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆమె ప్రదీప్ మాచిరాజుతో ఢీషోకి ఒక సీజన్ లో హోస్ట్ గా చేసింది. అలాగే జబర్దస్త్ రియాలిటీ షోకి యాంకర్ గా కొంతకాలం వర్క్ చేసింది. అలాగే నటిగా కూడా దీపికా పిళ్ళై సినిమాలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజుకి జోడీగా ఈ బ్యూటీ కనిపించబోతోంది.

గ్లామర్ షో విషయంలో దీపికా పిళ్ళై ముంబై భామలకి పోటీ ఇస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఈ బ్యూటీ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ గా బ్రేక్ కోసం దీపికా పిళ్ళై ఎదురుచూస్తోంది. ప్రదీప్ మాచిరాజు కూడా హీరోగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి జోడీగా తెరకెక్కబోయే సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందంట. మరి ఈసారి ప్రదీప్ మాచిరాజు ఎలాంటి కథాంశంతో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తోన్న సుడిగాలి సుధీర్ ఇప్పటికే హీరోగా అడుగుపెట్టాడు. ప్రస్తుతం హీరోగా అతని నుంచి మూడో సినిమా రాబోతోంది. గెటప్ శ్రీను కూడా హీరోగా రాజు యాదవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ లాంటివాళ్లు కమెడియన్స్ గా రాణిస్తున్నారు.

Tags:    
  • Pradeepmachiraju 
  • 30Preminchadamele 
  • Tollywood 
  • Anchor 
  • Television 
  • Deepikapilli 
  • Dheeshow 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS