ప్రభాస్, పవన్ చేసిన సాయం.. సుమ బయటపెట్టిన నిజం

యాంకర్ సుమ అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఏ ఈవెంట్ కైనా ఆమె ఉంటే ఆ సందడి వేరు.;

Update: 2025-12-30 07:39 GMT

యాంకర్ సుమ అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఏ ఈవెంట్ కైనా ఆమె ఉంటే ఆ సందడి వేరు. రీసెంట్ గా 'ది రాజాసాబ్' ఈవెంట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఇదే మాట చెప్పారు. సుమ గారు ఉంటే ఆ వైబ్ చాలా పాజిటివ్ గా ఉంటుందని, ఆమె ఎనర్జీ వేరని మెచ్చుకున్నారు. అయితే స్టేజ్ మీద కనిపించే ఈ సరదా సంభాషణల వెనుక, ఎవరికీ తెలియని ఒక ఎమోషనల్ కోణం కూడా ఉందని మరో రూట్లో బయటపడింది.




 


సోషల్ మీడియాలో నెటిజన్లతో ఇంటరాక్ట్ అవ్వడం సుమకు అలవాటే. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ "ప్రభాస్ గారి గురించి ఏదైనా చెప్పండి" అని అడగగా, సుమ ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరి మనసుల్ని గెలుచుకుంటోంది. సినిమాల్లో హీరోలు చేసే సామాజిక సేవ గురించి మనం వింటూ ఉంటాం. కానీ చాలా సైలెంట్ గా ప్రభాస్ చేస్తున్న ఒక గొప్ప పనిని సుమ మొదటిసారి రివీల్ చేశారు.

అసలు విషయం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం ఖమ్మంలో ఒక వృద్ధాశ్రమం నిర్మాణం కోసం సుమ తన వంతు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆశ్రమం పూర్తి చేయడానికి చాలా నిధులు అవసరమయ్యాయి. అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో పాటు మరికొందరు ప్రముఖులు ముందుకొచ్చి ఆ నిర్మాణం పూర్తి కావడానికి భారీగా సాయం చేశారట. వారి ఔదార్యం వల్లే ఆ వృద్ధాశ్రమం పనులు పూర్తయ్యాయని సుమ గుర్తు చేసుకున్నారు.

ఇక్కడే ప్రభాస్ గొప్పతనం ఏంటో ప్రత్యేకంగా అర్థమవుతుంది. కేవలం బిల్డింగ్ కట్టడానికి ఒకసారి డబ్బులిచ్చి ప్రభాస్ ఊరుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ ఆశ్రమంలో ఉండే వృద్ధులకు సాయం చేస్తూనే ఉన్నారు. ప్రతి నెలా అక్కడి పెద్దవారి కోసం ప్రభాస్ కొంత మొత్తాన్ని పంపిస్తున్నారట. ఏళ్ల తరబడి ఇలా కన్సిస్టెంట్ గా సాయం చేయడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం అని సుమ ఎమోషనల్ అయ్యారు.

ఈ మంచి పనిలో లక్ష్మీ మంచు, 'మేము సైతం' షో చొరవ కూడా ఉందని సుమ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి స్టార్స్ తమ స్టార్ డమ్ ని కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా, సాటి మనుషుల కోసం ఉపయోగించడం నిజంగా అభినందనీయం. ముఖ్యంగా ఎలాంటి పబ్లిసిటీ ఆశించకుండా గుప్తంగా దానాలు చేయడం వీరి వ్యక్తిత్వానికి నిదర్శనం.

ప్రభాస్ గురించి సుమ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ అంటే కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ అందరి బాగోగులు ఆలోచించే మంచి మనిషి అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. సుమ గారు ఈ విషయాన్ని బయటపెట్టడం వల్ల ప్రభాస్ మీద ఉన్న గౌరవం మరింత పెరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News