ఘనంగా క్లాసికల్ మ్యూజిక్ ఈవెంట్.. ముగింపు వేడుకల్లో అక్కినేని కోడలు!

శోభిత ధూళిపాళ్ల.. తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో సినిమాలు చేసింది కానీ పెద్దగా స్టార్ స్టేటస్ అయితే లభించలేదు.;

Update: 2025-12-30 07:40 GMT

శోభిత ధూళిపాళ్ల.. తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్, కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో సినిమాలు చేసింది కానీ పెద్దగా స్టార్ స్టేటస్ అయితే లభించలేదు. కానీ నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత శోభితతో రిలేషన్ లో ఉన్నట్లు ఎప్పుడైతే వార్తలు వచ్చాయో అప్పటినుంచి టాలీవుడ్ లో ఈమె పేరు బాగా వినిపించింది. దీనికి తోడు అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి నిశ్చితార్థం చేసుకోవడం.. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించడంతో శోభిత మరింత పాపులారిటీ అందుకుంది. అంతేకాదు గత ఏడాది డిసెంబర్ లో అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్ఆర్ విగ్రహం ముందు కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.




 


అయితే ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారి పెళ్లి ఫోటోలను కానీ వీడియోలను కానీ బయటకు వదలలేదు కానీ ఈ ఏడాది మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ పెళ్లి వీడియోలను అభిమానులతో పంచుకొని మళ్ళీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ . అంతేకాదు తన భర్తపై ఉన్న ప్రేమను ఒక్క మాటలో చెప్పి అందరిని మెస్మరైజ్ చేసింది.




 


ప్రస్తుతం పలు ఈవెంట్లకు ముఖ్యఅతిథిగా వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటున్న అక్కినేని కోడలు శోభిత మరో ఈవెంట్లో సందడి చేసింది. విషయంలోకి వెళ్తే తమిళనాడులో నిర్వహించిన ప్రతిష్టాత్మక సంగీత కార్యక్రమం.. "మార్గళియిల్ మక్కళ్ ఇసై"ఆరవ ఎడిసన్ చెన్నైలోని పచ్చయప్ప కాలేజ్ మైదానంలో ఘనంగా జరిగింది. ఈ ముగింపు వేడుకకు చీఫ్ గెస్ట్ గా హాజరైంది శోభిత. ఈ కార్యక్రమం మూడవరోజు అనగా ముగింపు రోజు అయిన 2025 డిసెంబర్ 23న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావడమే కాకుండా తన స్పీచ్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




 


ఈ ముగింపు వేడుకలలో శోభిత మాట్లాడుతూ.. "భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఉన్న గొప్ప వారసత్వాన్ని గుర్తుచేస్తూ జరిగే ఇలాంటి కార్యక్రమాలు అటు యువతలో సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయి. సాంప్రదాయ కళలను పరిరక్షించడంలో ప్రజల పాత్ర ఎంతో కీలకం" అంటూ తెలిపింది శోభిత. అలాగే సంగీత కళాకారులను, నిర్వాహకులను కూడా ప్రత్యేకంగా అభినందించింది.




 


"మార్గళియిల్ మక్కళ్ ఇసై" అనేది జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ గ్రామీణ కళలు , నిరసన సంగీతం వంటి వివిధ రకాల సంగీత రూపాలకు వేదిక కల్పించడానికి సృష్టించబడిన ఒక వేదిక అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తమిళ డైరెక్టర్ పా. రంజిత్ స్థాపించిన సంస్థ "నీలం కల్చరల్ సెంటర్" ప్రతిఏటా నిర్వహిస్తోంది. ముఖ్యంగా సామూహిక స్ఫూర్తి , సాంస్కృతిక గుర్తింపు కోసం జరుపుకునే ఈ కార్యక్రమం అరుదైన రికార్డును సృష్టించింది. ముఖ్యంగా ఈ వేడుకకు 40,000 మందికి పైగా ప్రజలు.. 500 మందికి పైగా కళాకారులు హాజరయ్యారు. అలాగే చిత్ర దర్శకులు వెట్రిమారన్ , లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, డైరెక్టర్ మారి సెల్వరాజ్, ఎంపీ కనిమొళి కరుణానిధితో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News